కామందులతో నిండిపోయిన వైసీపీ పార్టీ

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్

ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ సభ్యసమాజం సిగ్గుపడేవిధంగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రవర్తించారని విమర్శించారు.జగన్ రెడ్డి మొదటిలోనే వారి పార్టీ నాయకుల ప్రవర్తన పై చర్యలు తీసుకునివుంటే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించేదికాదని, జగన్ రెడ్డి పార్టీలో ఇటువంటి అచ్చోసిన అంబోతులు ఎక్కువైపోయారన్నారు. యధా రాజా తదా ప్రజా అన్న చందంగా వైసీపీ పార్టీ ఉందన్నారు.గతంలో SVBC చైర్మన్ గా ఉన్న పృద్వి ఆడవారిని వేధిస్తూ చేసిన చర్యల పై అతనిని సస్పెండ్ చేసినట్లే మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ అరగంట రమ్మన్న వీడియోలు వచ్చినప్పుడు గాని,అంబటి రాంబాబు MLAగా వున్నపుడు గంట రమ్మన్న వీడియోలు బహిర్గతం అయినపుడు వారిని పార్టీ నుండి , పదవుల నుండి తొలగించినట్లయితే ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ అంత బహిరంగంగా, నగ్న0గా వీడియో కాల్ ద్వారా ఆడవారిని వేదించేవాడు కాదని లుక్కా అన్నారు.ఇటువంటి నీచ చర్యలకు మూల కారణం ముఖ్యమంత్రి,పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కారణమన్నారు.

గతంలో ఎంపీ మాధవ్ కీయా పరిశ్రమ మేనేజ్ మెంట్ పై దౌర్జన్యాలు చేసి కమిషన్ల కోసం ప్రయత్నం చేసాడని,ఇతని భాగోతం పై ఆందోళనతో కీయా పరిశ్రమ యాజమాన్యం అనంతపురం నుండి వెళ్లిపోవాలని ఆలోచించారని అన్నారు.ఎంపీ మాధవ్ ఎన్నికల అఫిడవిట్ లో కూడా అత్యాచారం కేసు, మర్డర్ కేసును పొందుపరిచాడని, అవి తెలిసి కూడా జగన్ రెడ్డి ఇతనికి ఎంపీ సీటు ఇచ్చాడని అంటే దాని అర్ధం ఇటువంటి చిడపురుగులను పెంచి పోషిస్తున్నడని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు.

మహిళల పై జరుగుతున్న అన్యాయలపై స్పందించాల్సిన మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించకపోవడం విచారకరమని,వాసిరెడ్డి పద్మ నోరు మూగ బోయిందా అని ఎద్దేవా చేశారు.సాక్ష్యత్తు హోమ్ మంత్రి మహిళ అయివుండి ఎంపీ మాధవ్ నగ్న వీడియోలు ప్రపంచమంతా చూస్తుంటే వెంటనే అతనిపై చర్యలు తీసుకుపోవలసింది పోయి కనీసం స్పందన కరువైందన్నారు.

అయిన దానికి,కాని దానికీ మీడియా పబ్లిసిటీ కోసం నోరు పారేసుకునే మంత్రి రోజా మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇంత పనికిమాలిన పని చేసిన ఎంపీ మాధవ్ ను వైసీపీ నాయకులు వెనకేసుకు వస్తూ కులాన్ని,బీసీ వర్గాన్ని అడ్డుపెట్టి కుల రాజకీయాలను రెచ్చగొడుతూ మాధవ్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తే కులమతాలకు అతీతంగా సమాజం మొత్తం ఖండించాలన్నారు.

ఇకపై రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు గాని,వివిధ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు గాని తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని మహిళలను వేధించకుండా ఉండాలంటే అంబటి రాంబాబు,అవంతి శ్రీనివాస్,గోరంట్ల మాధవ్,MLC ఆనంతబాబు లాంటి సమాజానికి పట్టిన చీడపురుగులను పార్టీ సభ్యత్వం నుండి,ప్రభుత్వ పదవులనుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జగన్ రెడ్డి ని సవాల్ చేశారు. పార్లమెంట్ స్పందించి మాధవ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.ఇటువంటి సన్నాసులకు ఎంపీ,ఎమ్మెల్యే టికెట్ లు ఇచ్చినందుకు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply