Suryaa.co.in

Andhra Pradesh

అంగన్‌వాడీల్లో జూలై 1నుంచి మధ్యాహ్న భోజనం

– మెనూ సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు సర్వం సిద్ధమైంది . గర్భిణీలు , బాలింతల కోసం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని కరోనా నేపథ్యంలో 2020 మార్చిలో నిలుపుదల చేశారు . రెండేళ్ల అనంతరం తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది . ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 వేల 607 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని జూలై 1 వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు . ఈ పథకం అమలుకు సంబంధించిన ఏర్పాట్లను మహిళా శిశు సంక్షేమ శాఖ చేస్తోంది.

మధ్యాహ్న భోజనంతో పాటు చిన్నారులు , గర్భిణీలు , బాలింతలకు ఉడికించిన గుడ్డుతో పాటు పాలును కూడా అందిస్తారు . ప్రస్తుతం సరఫరా చేస్తున్న ముడి పోషకాలను ఈ నెల 30 వ తేదీ వరకు లబ్దిదారులకు అందిస్తారు . రానున్న 1 వ తేదీ నుంచి బాలింతలు , గర్భిణీలు , చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లోనే వండిన ఆహారాన్ని పంపిణీ చేస్తారు . దీనికి సంబంధించిన మెనూను కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే రూపొందించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు , ఐసీడీఎస్ సిబ్బందికి మెనూ వివరాలను పంపిణీ చేయడం జరిగింది . అన్నంతో పాటు విధిగా ఆకుకూరలు , దోసకాయ , బీరకాయ , సొరకాయ , టమోటా వంటి పోషకాలతో పప్పు , కోడిగుడ్డు కూర , అలాగే ఉడికించిన కోడిగుడ్డు , సాంబారుతో మెనూను రూపొందించారు . ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోషక విలువలు ఉన్న కూరగాయలు , ఆకుకూరలతో భోజనం ఉండేలా మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించడం జరిగింది . సోమవారం నుంచి శనివారం వరకు చిన్నారులు , గర్భిణీలు , బాలింతలకు ఈ మెనూను అంగన్వాడీల్లో అందించనున్నారు .

సోమవారం : తల్లులకు అన్నం దోసకాయ పప్పు కోడిగుడ్డు కూర 200 మి.లీ పాలు . పిల్లలకు అన్నం దోసకాయ పప్పు ఉడికించిన కోడిగుడ్డు -1 100 మి.లీ పాలు
మంగళవారం : అన్నం టొమాటో పప్పు కోడిగుడ్డు కూర 200 మి.లీ పాలు పులిహోర టొమాటో పప్పు ఉడికించిన కోడిగుడ్డు – 1100 మి.లీ పాలు – –
బుధవారం : అన్నం ఆకుకూర పప్పు కోడిగుడ్డు కూర 200 మి.లీ పాలు అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన కోడిగుడ్డు – 1 100 మి.లీ పాలు –
గురువారం : ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆకుకూర కూరగాయలతో సాంబారు 200 మి.లీ పాలు అన్నం ఆకుకూర ఉడికించిన కోడిగుడ్డు – 1 100 మి.లీ పాలు
శుక్రవారం : అన్నం బీరకాయ లేదా మునగాకు లేదా పాలకూరతో గుడ్డు కూర 200 మి.లీ పాలు అన్నం సొరకాయ పప్పు ఉడికించిన కోడిగుడ్డు – 1 100 మి.లీ పాలు –
శనివారం : వెజిటబుల్ రైస్ ఆకుకూర కూర కూరగాయలతో సాంబారు 200 మి.లీ పాలు వెజిటబుల్ రైస్ ఆకుకూర కూర ఉడికించిన కోడిగుడ్డు 1 100 మి.లీ పాలు

LEAVE A RESPONSE