పేద విద్యార్థులకు మాగులూరి ఫౌండేషన్ చేయూత

– అభినందించిన మాజీ మంత్రి కన్నా

సత్తెనపల్లి – పెదకూరపాడు నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో మాగులూరి ఫౌండేషన్ ద్వారా విద్యా – వైద్య రంగాలకు సంబంధించి 500 కార్యక్రమాలను చేసిన వాగులూరు భాను ప్రకాష్ ను శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు. అనంతరం కన్నా చేతుల మీదుగా పేద విద్యార్థులకు మాగులూరి ఫౌండేషన్ ద్వారా ఆరుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి 15000 చొప్పున, 90 వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో మాగులూరి ఫౌండేషన్ సభ్యులు , వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర నియోజకవర్గ మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply