Suryaa.co.in

National

జనవరి 13 నుంచి మహా కుంభమేళా

ప్రయాగ్రాజ్: వచ్చే ఏడాది అత్యంత వైభవంగా జరగనున్న మహా కుంభమేళాకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. 12 ఏళ్లకో సారి నిర్వహించే ఈ మహా కుంభమేళాకు యూపీ లోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 13 (పుష్య పూర్ణిమ) నుంచి ఫిబ్రవరి 26 (శివరాత్రి) వరకు ఈ పర్వదినం వైభవంగా కొనసాగనుంది. హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిల లోనూ కుంభమేళాను జరపనున్నారు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది సాధువులు, అఘోరాలు రానుండటంతో అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

LEAVE A RESPONSE