– ఎమ్మెల్యే యరపతినేని
అమరావతి: అయిదేళ్ళ వైసీపీ అరాచక ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనావస్థకు తీసుకువెళ్లి, రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా, ఉపాధి లేకుండా, కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితుల్లో, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని పల్నాడు జిల్లా, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో, గత ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే బడ్జెట్ గా ఉందన్నారు.
వ్యవసాయానికి పెద్దపీట వేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, నీటిపారుదలకి ప్రత్యేక నిధుల కేటాయింపు, పంచాయతీ రోడ్లకు నిధులు కేటాయింపు, సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులతో రాష్ట్రం ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. పారిశ్రామికంగా పురోగతి వచ్చినట్లయితే చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యే పరిస్థితి ఉందని తెలిపారు.