(రాజా ఆచంట)
కడపలో మహానాడు అంటే, ఏదో జగన్ కోసం, రాజకీయం కోసమో కాదు. రాజకీయం ఉంటుంది, కానీ రాయలసీమని అక్కున చేర్చుకుంది, అభివృద్ధి చేసింది టిడిపి మాత్రమే.. రాయలసీమలో మీటింగ్ పెట్టి ప్రజలకు దగ్గర అయ్యే హక్కు టిడిపికి మాత్రమే ఉంది..
రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల అభివృద్ధిలో ఇది టిడిపి మార్క్
* కుటుంబాలని చిన్నభిన్నం చేసిన ఫ్యాక్షన్‌పై అత్యంత కఠినంగా వ్యవహరించి, ఫ్యాక్షన్ లేకుండా చేసారు
* సీమకు సాగునీరు ఇవ్వడం ద్వారా అక్కడి స్థితిగతులు మార్చాలని టిడిపి సంకల్పం
* హంద్రీనీవా, గాలేరు – నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి లిఫ్ట్ వంటివి అందులోవే
* రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తాగు, సాగు నీరిచ్చిన ఘనత టిడిపిది
* డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సీమలో కరువుకు సమాధానం. నేడు డ్రిప్ లేని ప్రాంతమే లేని పరిస్థితి
* ఒకవైపు కరువు సీమను సస్యశ్యామలం చేస్తూ మరోవైపు పారిశ్రామికీకరణకు పెద్దపీట
* కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్, కర్నూలులో ఓర్వకల్ హబ్, అనంతపురం జిల్లాలో కియా, విండ్ పవర్, సోలార్ ద్వారా సీమలో ప్రగతిని వేగవంతం చేసాం
* తిరుమల, తిరుపతి అభివృద్ధి జరిగిందంటే టీడీపీ హయాంలోనే
* కడప, కర్నూలు ఎయిర్ పోర్టు నిర్మించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే
* రాయలసీమని హార్టీకల్చర్ హబ్ గా తీర్చిదిద్దింది టిడిపి
* అనంతపురం ఆటోమొబైల్ హబ్ గా, చిత్తూరు ఎలక్ట్రానిక్స్ హబ్ గా, కర్నూల్, కడప సోలార్, గ్రీన్ ఎనర్జీ హబ్ గా టిడిపి తీర్చి దిద్దుతుంది
రాయలసీమను అభివృద్ధి బాట పట్టించేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తాగునీటి వసతుల ఏర్పాటు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఉధ్యోగాల కల్పనకు అవసరమైన కార్యాచరణ రూపొందించిందే తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులకు రూప కల్పన చేసింది ఎన్టీఆర్. వెనుకబడ్డ రాయలసీమలో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ అభివృద్ధికి టీడీవీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఫ్యాక్షన్ తరిమి కొట్టింది.
నాడు వలసలకు నిలయమైన అనంతపురం జిల్లా నేడు కొలువులకు నిలయంగా మారింది. వ్యవసాయ భూములకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా సాగునీటి సదుపాయం కల్పించి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చి కరువు ప్రాంతమైన రాయలసీమను ఉధ్యాన కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం.
నదుల అనుసంధానంతో రాయల సీమకు సాగునీరు అందించి రతనాల సీమగా మార్చడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కరువు కాటకాలతో మగ్గిపోయే రాయలసీమను కరువు రహిత సీమగా మార్చేందుకు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసింది సాక్షాత్తూ చంద్రబాబే. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను రాయలసీమ ప్రాంతానికి మళ్లించి ఆ ప్రాంతంలో కరువును రూపుమాపాలని ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని అధికారులను, కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించారు చంద్రబాబు.
మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చెయ్యాలని పనులను పరుగులు తీయించారు చంద్రబాబు. హంద్రీ-నీవా పూర్తిచేసి చిత్తూరు జిల్లా కుప్పం వరకు తాగు, సాగునీరు అందించాలని, అలాగే గాలేరు-నగరి పూర్తిచేసి గండికోట నీటిని పులివెందుల వరకు తరలించారు.
రాష్ట్రంలో రాయలసీమ తీవ్ర నీటి ఎద్దడి ఉంటుంది. ఈ కారణంగా సీమ నీటికష్టాలు తీర్చ డానికి ఎన్.టీ.రామారావు తెలుగుగంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. కృష్ణా మిగులు జలాలను కరువుప్రాంతానికి అందించడంకోసం, నలుగురు ముఖ్యమం త్రులను కన్విన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్ తో తమిళనాడుకు కూడా తాగునీరు అందించా రు. తెలుగుగంగ తర్వాత గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టులతో మొత్తం రాయలసీమ ను సస్యశ్యామలం చేయాలని ఎన్.టీ.ఆర్ తలచారు.
చంద్రబాబు వచ్చాక పట్టిసీమ నిర్మించి, కృష్ణా జలాలను సీమకు అందించారు. దేశమంతా ఆలోచిస్తున్న నదుల అనుసంధానం ప్రాజెక్ట్ లో ఇదొక తొలిఅడుగు. పోలవరం కుడికాలువద్వారా ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించి, శ్రీశైలంలోని కృష్ణా నీటిని రాయలసీమకు తరలించేలా ప్రణాళికలు తయారుచేసారు. అదేసమయంలో బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి, నల్లమల ఫారెస్ట్ లో ఒక 35 కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తే, గోదావరి నీరు నేరుగా పెన్నానదికి వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా రాయలసీమలోని అన్నిరిజర్వాయర్లకు కేంద్రబిందువైన బనకచర్ల రిజర్వాయర్ కు నీటిని తరలిస్తే, అక్కడినుంచి కండలేరు, సోమశిలవరకు నీటిని పంపవచ్చు. ఈ మొత్తం ప్రణాళికతో నదుల అనుసంధానం మొత్తం పూర్తవుతుంది. ఈ విధమైన ఆలోచన, దూరదృష్టితో రాష్ట్రాన్ని, ముఖ్యంగా రాయలసీమని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నారు.
రాయలసీమ సాగు నీటి ప్రాజెక్ట్ ల పై చంద్రబాబు మార్క్ :
కృష్ణా నది పై నీటి ప్రవాహం సహజంగా తగ్గిపోతూ వస్తున్న వేళ, రాష్ట్ర విభజన తరువాత, అది మరింత దుర్భాలం అయ్యింది. నవంబర్ నెలలో వచ్చే 10-15 రోజుల వరద జలాల కోసం, ఇటు డెల్టా ప్రాంతం, అటు రాయలసీమ ప్రాంతం ఎదురు చూడాల్సిన పరిస్థితి. దీంతో చంద్రబాబు గారు ముందు చూపుతూ, మొదటి ఏడాదిలోనే, పట్టిసీమ ఎత్తిపోతల పధకానికి రూపకల్పన చేసి, కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసారు. దీంతో డెల్టా ప్రాంతానికి పట్టిసీమ నుంచి నీరు వస్తే, శ్రీశైలం నుంచి కిందకు వచ్చే ప్రతి చుక్కను రాయలసీమకు మళ్ళించారు.
పట్టిసీమ ప్రభావం రాయలసీమ పై ఎంతో ఉంది. పట్టిసీమ నిర్మాణానికి ముందు 2009-2013 మధ్య 314 టీఎంసీలు ఇవ్వగా, 2014-2019 మధ్య ఐదేళ్లలో 451 టీఎంసీలు నీళ్లు ఒక్క శ్రీశైలం జలాశయం నుంచే ఇచ్చారు. తుంగభద్ర జలాశయం నుంచి సీమ జిల్లాలకు 250 టీఎంసీలు వరకు ఇచ్చారు. ఇక హంద్రీనీవా విషయానికి వస్తే, అంతకుముందు ఐదేళ్లలో హంద్రీనీవా నుంచి కేవలం 11.13 టీఎంసీలు ఇవ్వగా 2014-2019 మధ్య 119.97 టీఎంసీలు ఇవ్వగలిగారు. ఇక కొత్తగా కట్టిన ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 6.66 టీఎంసీలు సరఫరా చేశారు. మొత్తంగా, 2014-19 మధ్య చంద్రబాబు హయంలో, ఒక్క శ్రీశైలం నుంచే 451 టీఎంసీలు ఇవ్వగా, అన్నీ కలుపుకుని, 827 టీఎంసీల నీరు రాయలసీమకు పంపించారు చంద్రబాబు.
పట్టిసీమ కారణంగా, వరద జలాల ఆధారంగా నిర్మించిన హంద్రీనీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు నీళ్లు తీసుకునే అవకాశం వచ్చింది. హంద్రీనీవా ఎత్తిపోతల రెండో దశ పూర్తి చేసుకుంటూ ఒక్కో జలశయాన్ని నింపుతూ.. నీటిని మదనపల్లిని దాటించారు చంద్రబాబు. అటు పుంగనూరు బ్రాంచి కాలువ, కుప్పం కాలువ వైపు నీళ్లు ప్రవహించేలా చేసారు. మరోవైపు గాలేరు నగరి తొలిదశ పనులు కొలిక్కి వచ్చేలా చేసారు. అవుకు టన్నెల్ తవ్వకంలో వచ్చిన సమస్యలను చక్కదిద్ది, గోరకల్లు సమస్యలను పరిష్కరించుకుంటూ గండికోట జలాశయంలో నీటి నిల్వలు పెంచగలిగారు. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్ళు ఇస్తాను అని చెప్పి, పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చారు చంద్రబాబు.
గండికోట జలాశయంలో నీటి నిల్వలు పెంచారు. అక్కడి నుంచి మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయం, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం జలాశయాలకు నీటిని అందించారు. కడప జిల్లాలో కొంత ఆయకట్టు స్థిరీకరించారు. మైలవరం జలాశయం కింద ఉత్తరకాల్వ, దక్షిణ కాల్వల పరిధిలో 72 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలో 1999 తర్వాత 2018లోనే సాగు చేయగలిగారు. మరోవైపు కుందూ ద్వారా పెన్నాకు అక్కణ్నుంచి సోమశిలకు నీరు తరలించారు.
ఫలితంగా, కడప జిల్లాలో చీనీ తోటలు పచ్చదనంతో కళకళలాడాయి. చిత్తూరు జిల్లాలో కాలువలోకి నీళ్లు ప్రవహించాయి. అనంతపురంలో ఏళ్ల తరబడి సాగుకు దూరమైన పొలాల్లో వరి సిరులు పండాయి. కర్నూల్ జిల్లాలో జల సవ్వడి నెలకొంది.
చంద్రబాబు , 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమలో కట్టిన సాగు నీటి ప్రాజక్టులు ఇవి. కర్నూలు జిల్లాలో సిద్ధాపురం ఎత్తిపోతల, చిత్తూరు జిల్లాలో అడవిపల్లి రిజర్వాయరు, కడపలో గండికోట రిజర్వాయరు, అనంతపురం జిల్లాలో మడకశిర బ్రాంచి కెనాల్, చిత్తూరు జిల్లాలో మారాల రిజర్వాయరు, కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల, చిత్తూరు జిల్లాలో చెర్లోపల్లి రిజర్వాయరు, కర్నూలు జిల్లాలో గోరుకల్లు రిజర్వాయరు, అవుకు టన్నెల్, పులికనుమ ఎత్తిపోతల, పులికుర్తి ఎత్తిపోతల, చిత్తూరు జిల్లాలో కుప్పం బ్రాంచి కెనాల్, నెల్లూరు జిల్లాలో కండలేరు ఎత్తిపోతల పధకం, కడపలో గండికోట సీబీఆర్ లిఫ్ట్, ప్రకాశం జిల్లాలో కొరిశపాడు ఎత్తిపోతల.
చంద్రబాబు హయంలో 90 శాతం పైగా పూర్తయిన ప్రాజెక్ట్ లు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, సోమశిల స్వర్ణముఖి రిజర్వాయర్, ఫేజ్-1 హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ విస్తరణ, మిడ్ పెన్నార్ ఆధునికీకరణ, కమ్యూనిటీ లిఫ్ట్-డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల స్రవంతి రెండో దశ ఏడు ప్యాకేజీలు, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నాకు ఎత్తిపోతల, జీడిపల్లి నుంచి భైరవానితిప్ప ఎత్తిపోతలు, కర్నూలు జిల్లాలోని మెట్ట మండలాలకు నీటి సరఫరా, వెలిగొండ ప్రాజెక్టు-హెడ్ రెగ్యులేటర్
చంద్రబాబు హయంలో రాయలసీమకు అధిక సాగు నీరు కోసం ప్రణాళికలు వేసిన ప్రాజెక్టులు, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ నుంచి మల్లెమడుగుకు బాలాజీ రిజర్వాయర్‌కు నీటి తరలింపు, అల్తూరుపాడు రిజర్వాయర్‌కు నీరు, కుప్పంలో మైనర్ ఇరిగేషన్ పథకాలు, వేదవతి ఎత్తిపోతల పథకం, రాజోలిబండ డైవర్షన్ స్కీం కుడి కాలువ, గుండ్రేవుల రిజర్వాయర్, గోదావరి-పెన్నా అనుసంధానం ఫేజ్-1
ఇక చంద్రబాబు హయంలో, సీమకు గుండెకాయి వంటి, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల వివరాలు చూద్దాం.
హంద్రీ-నీవా సుజల స్రవంతి (ఫేజ్-I&II) వివరాలు – ప్రధాన కాలువకు సంబంధించిన అన్ని పంపులు, మోటార్లు పూర్తి చేసారు. 2014-2015లో 16.83 టి.యం.సి.ల. నీటిని శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తి పోసారు. 2015-2016 లో కరువు పీడిత సంవత్సరం అయినప్పటికి 7.8 టి.యం.సి.ల నీటిని ఎత్తి…
అభివృద్ధి వికేంద్రీకరణలో రాయలసీమకి అధిక గుర్తింపు ఇచ్చింది టిడిపి
2014-19 మధ్యలో IISER , IIT తిరుపతిలో .. NACEN అనంత.. IIT కర్నూల్ .. IIT శ్రీసిటీ .. ఇలా 12 నేషనల్ ఇనిస్టిట్యూట్ లలో 5 సీమలోనే ఏర్పాటు చేసారు
కియా, అపోలో, హీరో, జోహో, ఫ్లెక్స్, సెల్కాన్, కార్బన్ etc ఇలా అనేక భారీ పరిశ్రమలను సీమలోనే ఏర్పాటు చేసారు
గోదావరి మిగులు జలాలను కృష్ణకు తరలించి… కృష్ణా నది జలాలను శ్రీశైలం నుంచి సీమకు తరలించాలనే పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మించారు.
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో, పూర్తి చేసిన ప్రాజెక్టులు : 28. అందులో 15 ప్రాజెక్టులు సీమ జిల్లాలోనే ఉన్నాయి.
కర్నూలు జిల్లాలో సిద్ధాపురం ఎత్తిపోతలచిత్తూరు జిల్లాలో అడవిపల్లి రిజర్వాయరుకడప జిల్లాలో గండికోట రిజర్వాయరుఅనంతపురం జిల్లాలో మడకశిర బ్రాంచి కెనాల్‌చిత్తూరు జిల్లాలో మారాల రిజర్వాయరుకర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతలచిత్తూరు జిల్లాలో చెర్లోపల్లి రిజర్వాయరుకర్నూలు జిల్లాలో గోరుకల్లు రిజర్వాయరుకర్నూలు జిల్లాలో అవుకు టన్నెల్‌కర్నూలు జిల్లాలో పులికనుమ ఎత్తిపోతలకర్నూలు జిల్లాలో పులికుర్తి ఎత్తిపోతలచిత్తూరు జిల్లాలో కుప్పం బ్రాంచి కెనాల్‌కడప జిల్లాలో గండికోట సీబీఆర్ లిఫ్ట్‌ఎస్‌హెచ్ 31 రోడ్‌వర్క్-జీఎన్‌ఎ్‌సఎ్‌స మొదటిదశగొల్లపల్లి రిజర్వాయర్‌పై మడకశిర బ్రాంచ్ కెనాల్
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల పైనే 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాం. పనులు వేగవంతం అయ్యేందుకు ప్రాజెక్టు గట్ల పైనే బసచేసాం. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై రూ.4200 కోట్లు ఖర్చు చేసి కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి వి.కోట వరకు తెచ్చాం. 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును 10 శాతం కూడా పూర్తి చేయలేకపోయిన వైసీపీ ప్రభుత్వం నీటి విడుదల అంటూ సినిమా సెట్టింగ్ వేసి నాటకాలు ఆడింది. రాయలసీమకు అన్ని విధాలా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహాన్ రెడ్డి. ఏకంగా 102 సాగునీటి ప్రాజెక్టులను పడుకోబెట్టాడు. పంటలను ఎండబెట్టాడు. తాగునీటికి కటకటలాడే పరిస్థితి తెచ్చాడు.