సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలను ప్రజలందరికీ అందేలా చూడండి

– ఎంపీపీ సురేష్ ను అభినందించిన మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 30: సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలను ప్రజలందరికీ అందేలా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడ్లవల్లేరు ఎంపీపీ కొడాలి సురేష్, శ్రీ కొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాలను అందజేసి పూలమాలతో సన్మానించారు. గుడ్లవల్లేరు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన కొడాలి సురేష్ ను మంత్రి కొడాలి నాని అభినందించారు. శ్రీ కొండాలమ్మ దేవస్థానం చైర్మన్ కనుమూరి రామిరెడ్డిని పూలమాలతో సత్కరించారు. గుడ్లవల్లేరు ఎంపీపీగా కొడాలి సురేష్ ను ఎంపిక చేయడం పట్ల మంత్రి కొడాలి నానికి, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో 32 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని, ఎన్నికలకు ముందే ఐదు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెల్చుకుందని చెప్పారు. 27 ఎంపీటీసీ సెగ్మెంట్ లో ఎన్నికలు జరిగాయని, అన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారని తెలిపారు.
అలాగే గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకుందని అన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు. ఎన్నికలు ఆలస్యంగా జరిగినా ఫలితాలు మాత్రం ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహనరెడ్డితోనే ఉన్నాయని పరిషత్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు. సీఎం జగన్మోహనరెడ్డిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. గుడివాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రభుత్వ కార్యక్రమాలను అర్హులైన పేదలకు అందేలా చూడాలన్నారు. పేదప్రజల కష్టాలను స్వయంగా చూసిన సీఎం జగన్మోహనరెడ్డి వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చారని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డి ఆశయాలకనుగుణంగా ప్రజాప్రతినిధులందరూ పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ఏవైనా సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాలేటి చంటి, అల్లూరి ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు మేరుగు నాగన్న, గుడ్లవల్లేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఎండీ బాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply