– బొప్పరాజు , పలిశెట్టి పిలుపు
ఏపిజెఏసి రాష్ట్రకమిటి ఇచ్చిన మలిదశ ఉధ్యమకార్యచరణలో బాగంగా ఈనెల 11 న మంగళవారం ఒక్కరోజు ప్రభుత్వఉధ్యోగులంతా సెల్ పోన్ వినియోగించకుండా ఉధ్యోగులలో ఉన్న ఆవేదను, నిరశను ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ సెల్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు సోమవారం ఒక ప్రకటద్వారా ఉధ్యోగులకు పిలుపునిచ్చారు.
సోమవారం మలిధశ ఉధ్యమకార్యచరణలో బాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాకలెక్టర్సు కార్యాలయాలలో ఉద్యోగ,ఉపాధ్యయ,కార్మిక,రిటైర్డు,కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఫిభ్రవరి 13 న 50 పేజీలతో సియస్ గారికి ఇచ్చిన మెమోరాండం కాఫీలను అందరికలెక్టర్లకు స్పంధనా కార్యక్రమాలద్వారా ఇస్తూ ఉధ్యోగులలో ఉన్న ఆవేధనలు ప్రభుత్వం దృష్టికీ తీసుకొని వెళ్లమని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తూ 26 జిల్లాలలో ఉన్న ఏపిజెఏసి అమరావతి జిల్లా చైర్మన్లు/ప్రధానకార్యదర్శులు ఇతరనాయకులు ఆధ్వర్యంలో మెమోరాండాలు సమర్పించడం జరిగిందని తెలిపారు.
అలాగే ఈ ఉద్యమ కార్యాచరణలో బాగంగా ఈనెల 11 ను సెల్ డౌన్ కార్యక్రమంతో పాటు ఈనెల 12 న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలవద్ధ ఉద్యోగులు మరియు రిటైర్డు ఉధ్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని జెఏసి నాయకులు బొప్పరాజు , పలిశెట్టి తెలిపారు.