– ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు తగిన వాటాను ఇవ్వాలి
– అన్ని కులాలకు న్యాయం జరిగేలా శాస్త్రీయంగా వర్గీకరణ చేయాలి
– సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిత్యం నిలబడుతాం
– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ
సికింద్రాబాద్: ఎస్సీ వర్గీకరణ ABCD అనే నాలుగు గ్రూప్ లుగా చేయాలని ప్రస్తుతం గ్రూప్ -3 లో నేతకాని, మహర్,మాల దాసరి, హోలీయ దాసరి, మిత్ అయ్యలవార్ మొదలగు కులాలను కొనసాగించి మాలలను గ్రూప్ – 4 లో చేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు.
జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణలో శాస్త్రీయత, హేతుబద్ధత పూర్తిగా లోపించిందని , అందువల్లనే అన్ని కులాల్లో అసంతృప్తి నెలకొని ఉందని.. కనుక అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణను మాలలు మినహా ఎస్సీలలో మిగితా 58 కులాలు కోరుతున్నాయని అన్నారు.లక్షల డప్పుల ఉద్యమ ప్రభావంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఆగమేఘాల మీద శాసనసభలో ఆమోదించిందని అన్నారు.అయితే జస్టీస్ షమీమ్ అక్తర్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఏ మాత్రం శాస్త్రీయత గానీ, హేతుబద్ధత గానీ పాటించలేదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పూర్తిగా అధ్యయనం చేయకుండానే ఆమోదించిందని అన్నారు.మాదిగల జనాభాను పరిగణనలోకి తీసుకున్నా లేదా వెనుకబాటుతనం ఆధారంగా తీసుకున్నా 12% రిజర్వేషన్లు రావాలని అన్నారు.ఎస్సీ వర్గీకరణ ప్రకారం మూడు గ్రూప్ లు చేస్తే ఒక గ్రూప్ లో వెనుకబాటుతనం మరొక గ్రూప్ లో జనాభా మరొక గ్రూప్ లో ఏ ఆధారం లేకుండానే రిజర్వేషన్లు కేటాయించి అశాస్తీయంగా వర్గీకరణ చేశారు. ఈ తప్పులను లోపాలను సవరించాలని అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలని అన్నారు.ముఖ్యమంత్రి మా విజ్ఞప్తి మేరకు కమిషన్ గడువు పొడగించారని ,అదే స్ఫూర్తితో అన్ని కులాల ఆకాంక్షల్ని పరిగణలోకి తీసుకుని న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని కేవలం మాదిగల కోసం మాత్రమే నడుపలేదని అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు లభించేలా చేయడమే మా లక్ష్యం అని అన్నారు.ఎమ్మార్పీఎస్ ఉద్యమం మొదటి నుండి సామాజిక న్యాయానికి , సమానత్వానికి కట్టుబడి ఉందని దాని ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
గ్రూప్ – 1 లో నుండి అభివృద్ధి చెందిన కులాలైన మన్నె , పంబాలా కులాలను తొలగించాలని డిమాండ్ చేశారు.రిజర్వేషన్ల కేటాయింపులు , కులాల కూర్పు నిర్దిష్టంగా , హేతుబద్ధంగా చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని , ప్రజల్లోకి అన్ని విషయాలను వివరంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.మనకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం మరో పోరాటాన్ని సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అధ్యక్షత వహించగా మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత, బిసి నేత డా. పృథ్వీరాజ్ యాదవ్ ,సయ్యద్ ఇస్మాయిల్ , హోలియా దాసరి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ ,సీనియర్ నాయకులు జానకి రామయ్య,వేల్పుల సూరన్న , ఇంజం వెంకటస్వామి , రాగటి సత్యం , బొర్ర బిక్షపతి మాదిగ, ఇటిక శ్రీకృష్ణ మాదిగ ,కళా నేతలు మిట్టపల్లి సురేందర్, మచ్చ దేవేందర్, రామంచ భరత్, హైదరాబాద్ జిల్లా నేతలు టీవి నరసింహా, డప్పు మల్లికార్జున్ మాదిగ , అజిత్ కళ్యాణ్ వాల్మీకి,VS రాజు, వెలుపుల విష్ణు మాదిగ,మునిరతి అరుణ్ మాదిగ,MSF జాతీయ అధికార ప్రతినిధి సోమశేఖర్ మాదిగ, కొమ్ము శేఖర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు