Suryaa.co.in

Telangana

నిజమైన దేశభక్తికి జెండాలాంటి నాయకుడు మన్మోహన్ సింగ్

– అసెంబ్లీలో డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: సభ్యులు చెప్పినట్టు.. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచం మెచ్చిన ఆర్ధికవేత్త, సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాట పట్టించిన గొప్ప నాయకుడు.ఎన్నో అద్భుతమైన చట్టాల రూపకర్త, ఇవన్నీ ఒకెత్తయితే.. రాజకీయాల్లో ఉండే నాయకులు ఎంత హుందాగా వ్యవహరించాలో చెప్పిన అరుదైన నాయకుడు.

ఆయన సిక్కుగా తలపాగా ధరించినా.. ఈ దేశమంతా ఆయన మా ప్రధాని అని భావించింది తప్పితే..ఆయనలో ఈ దేశం మతం చూడలేదు. అది నిజమైన భారతీయత. ఒక్కమాటలో చెప్పాలంటే.. స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.. నిజమైన దేశభక్తికి జెండాలాంటి నాయకుడు. ప్రధాని పదవిలో ఉన్నా ఇంటి నుంచి సద్ది తెచ్చుకొన్న సామాన్యుడు.

నేను యాక్సిడెంటల్ ప్రధానినే కాదు, యాక్సిడెంటల్ ఆర్ధిక మంత్రినికూడా అని తనపై తానే చలోక్తులు విసురుకున్న నిగర్వి డాక్టర్ మన్మోహన్ సింగ్. పార్లమెంట్ సాక్షిగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి ధర్నాలో పాల్గొంటే స్వయంగా వారు మా మధ్యలో కూర్చొని మాతో ఫోటో దిగారు. తెలంగాణ సాధనలో వారు అందించిన సహకారం ఎప్పటికి మరచిపోలేము. అలాంటి నాయకుని విగ్రహం తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను.

అయన స్వర్గస్తులైన తర్వాత నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ముందు ధర్నా చేస్తుంటే.. 90 యేండ్లు వయసులోను మా మధ్యన కూర్చుండి నిరసన తెలిపిన ఫోటో చూస్తే కన్నీళ్లు వచ్చాయి.

LEAVE A RESPONSE