కాకా హోటల్లో పని చేస్తే చీప్
స్టార్ హోటల్లోనైతే చెఫ్..!
ఒకప్పుడు వార్తలు
రాసేది రిపోర్టర్..
ఇప్పుడు సోషల్ మీడియాలు
వచ్చాక ప్రతివోడు రాపోర్టర్..!
నిజమో కాదో ధృవీకరించుకుని
వార్త రాసే వాడు జర్నలిస్టు..
నచ్చింది..నిజమైనా..
పుకారైనా..గీకేసే వాడు
జర’నీలి’స్టు..!
రోడ్డుపై మేస్త్రీతో బేరమాడి కొంటే రూపాయి తగ్గిద్ది..
కార్పోరేట్లో గీకి గీకి
పర్చేస్ చేస్తే గూబ పగులిద్ది!
అన్నీ అమ్మే అమెజాన్ను
కూడా అమ్మే జాన్
మన పాలకులది..
ప్రజాస్వామ్య దేశంలో
ప్రతి స్కీము ఒక స్కామే..
నిజానికి స్కాము కూడా
ఒక స్కీమే..!
1991 లో సరళీకృత
ఆర్థిక విధానాలు.. మన్మోహన్ మానియా..!
2004లో మన్మోహన్ను
కట్టి పడేసింది సోనియా..!
2015లో పెద్ద నోట్ల రద్దుతో
నివ్వెరపోయింది దునియా!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286…