Suryaa.co.in

Andhra Pradesh

మాస్టర్స్ డిగ్రీ కాస్త..డిప్లమా డిగ్రీ అయ్యింది

ట్విట్టర్ లో ఎమ్మెల్యే ఆర్కేపై టిడిపి సీనియర్ నేత బుద్దా వెంకన్న సెటైర్లు

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు సర్టిఫికెట్‌పై వివాదం రేగిన నేపథ్యంలో సీఎం జగన్ ఫేక్ డిగ్రీలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సండూర్ పవర్‌లో అప్పట్లో ఎండీగా ఉన్న జగన్ సర్టిఫికెట్లను ట్వీట్ చేశారు. ఈ

వ్యవహారాన్ని టీడీపీ నేత బుద్దా వెంకన్న కొనసాగిస్తూ, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దొంగ డిగ్రీలంటూ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

‘‘తమ బాస్ జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని, దొంగ సర్టిఫికేట్లు, దొంగ విద్యార్హతలు పెట్టే వైసీపీలోని ఇంకొకడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి.2014 ఎన్నికల అఫిడవిట్ లో, 1993లో మైసూరు ఓపెన్ యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పొలిటికల్ సైన్సు పట్టాను పొందానని పెట్టాడు. సదరు విధ్యా సంస్థ స్థాపించిందే 96లో అయితే, దానికి 3 సంవత్సరాలకు ముందే రామకృష్ణారెడ్డికి సర్టిఫికేట్ లభించడం విశేషం.అయితే 2019 అఫిడవిట్ కు వచ్చే సరికి, మాస్టర్స్ డిగ్రీ కాస్త డిప్లమా డిగ్రీ అయ్యింది. ఇలాంటి దొంగ వేషాలు వేసే మీరు, ఏ తప్పు చేయని అశోక్ బాబు గారి పైన నిందలు వేయటమా ?’’

LEAVE A RESPONSE