Suryaa.co.in

Political News

మీ శాంతి ఎవరో? భద్ర ఎవరో?

(బాబు)

మాజీ సీఐ మాధవ్ గారూ,

మీ శాంతి ఎవరో? భద్ర ఎవరో? నీ గోలేంటో జనానికి అస్సలు అర్థం కావడం లేదు!

మర్చిపోయారా ఏమిటి సార్? మొన్నామధ్య మీరే స్వయంగా ప్రస్తుత ప్రభ్యత్వ హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ‘తనిఖీ’ చేశారుగా! అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న కిరణ్ మీద వీధి రౌడీలా దాడి చేయడానికి పోయి అరెస్టయ్యి, మీ ముఖానికి ముసుగేస్తుంటే ‘నేను దేశానికి ఎంపీని, పోలీసు అధికారిని’ అని రెచ్చిపోయారు.

అంతేకాదు, గుంటూరు, రాజమండ్రి జైళ్లలో భోజనాలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా పీటీ వారెంట్ల మీద వెళ్లి చూసొచ్చారు కదా!

అయినా, లిక్కర్ కుంభకోణంలో అరెస్టులు జరిగితే శాంతి భద్రతలు లేవని ఒక మాజీ పోలీసు అధికారి అయి ఉండి ఇంత తెలివితక్కువగా, దిగజారి మీరు మాట్లాడరని మాకు తెలుసు. మంచి క్వాలిటీ లిక్కర్ మత్తులో నిక్కరు కూడా ఉంచుకోరు మీరు. మీరు ఎన్ని రౌండ్లో వేశారో కానీ… శాంతిని, భద్రతని తలుచుకుంటూ మురిసిపోతున్నారు! ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, దయచేసి దిగంబరంగా మాత్రం దర్శనమివ్వకండి!

LEAVE A RESPONSE