– అప్పటి తహసీల్దార్ కృష్ణమోహన్ రెడ్డి గారి కిక్కు కథ
( భూమా. బి)
ఆంధ్రా నిద్రలేచింది. ఎప్పటిలాగే కోళ్లు కూశాయి, పేపర్ బాయ్ సైకిల్ గంట మోగింది. కానీ, ఈరోజు గాలిలో ఒక కొత్త ‘కిక్కు’ ఉంది – అదే మద్యం కుంభకోణం! అందరూ ఒకటే మాట అంటున్నారు – పి. కృష్ణ మోహన్ రెడ్డి! ఈ పేరు వినగానే లీలగా గుర్తుకొచ్చి పాత తలనొప్పి మళ్ళీ మొదలైనట్టు కొందరికి అనిపించింది.
రెండు దశాబ్దాల క్రితం, ఇదే పేరు సికంద్రాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీసులో పెద్ద హడావిడి చేసింది.
సనా మాలిక్ కమల్ అట! ఎవరో అనుకుంటే, అది మన మోనికా బేడి గారు, బాయ్ ఫ్రెండ్ అబూ సలేం అనే పెద్ద ‘గ్యాంగ్ స్టర్’తో కలిసి పాస్‌పోర్ట్ తెచ్చుకోవడానికి వేసిన స్కెచ్ లో వినిపించింది.
అప్పుడు మన కృష్ణ మోహన్ రెడ్డి గారు కర్నూలులో తహసీల్దార్ (అప్పటి పోస్ట్). ఎవరో మహమ్మద్ యూనిస్ ఏదో ‘ఫేక్’ లెటర్ ఇస్తే, దాని మీద ‘కళ్ళు పెద్దవి చేసుకొని’ సంతకం పెట్టేశారు! పాపం, బులుగు డ్రెస్ లో వున్న మోనికా బేడీ ఫోటో చూసి క్రష్ తో పెట్టాడో లేదా క్యాష్ చూసి పెట్టాడో గానీ.. అప్పుడు ఆయనకు తెలీదు ఆ సంతకం ఒక పెద్ద సినిమాకు ‘టికెట్’ అవుతుందని.
“అప్పుడు ఒక నకిలీ పాస్‌పోర్ట్ కోసం సంతకం పెట్టారు, ఇప్పుడు ఏకంగా మద్యం కుంభకోణంలో కళ్ళుమూసుకున్నాడా?” టీ కొట్టు దగ్గర ఒక యువకుడు నవ్వుతూ అడిగాడు. “అప్పుడు బేడీ మీద మనసుపారేసుకొన్నారేమో, ఇప్పుడు ఏమో లిక్కర్ కిక్కులో ఉన్నట్టున్నారు!” అని ఇంకొకాయన నవ్వుతూ.
గతం వెక్కిరిస్తోంది. అప్పటి ‘చిన్న’ పొరపాటు – ఒక గ్యాంగ్‌స్టర్‌కి హెల్ప్ చేయడం – ఇప్పుడు ఏకంగా దేశాన్ని షేక్ చేసే కుంభకోణంలో జగన్ గ్యాంగ్ లో కీలక రోల్ అయ్యాడు అని కొందరు అంటున్నారు, “రెడ్డి గారి మీద అప్పుడే కొంచెం ‘స్ట్రాంగ్’గా ఉండాల్సింది, అప్పుడే ఆపితే ఇప్పుడు ఈ ‘లిక్కర్’ తలనొప్పి ఉండేది కాదు కదా!” అని కొందరు.
చట్టం తన దారిలో వెళ్తోంది. కానీ, జనం మాత్రం జోకులు వేసుకుంటున్నారు. “బహుశా రెడ్డి గారికి వయసులో వున్న క్రష్ పోయి, ముదిరాక పూర్తిగా క్యాష్ మీద క్రష్ పెంచుకున్నాడు కాబోలు!” అని.
ఏదేమైనా, ఆంధ్రాలో మాత్రం ఒకటే చర్చ – ఈ కృష్ణ మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్లకు చట్టానికి చిక్కారు. విచారణలో జగన్ పేరు కదిపితే ‘ఓల్డ్ మంక్’ లా.. మౌనంగా వుంటారా.. లేదా కుదిపిన బీరు సీసాలా పొంగుతాడా అనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.
అప్పటి సంతకం విషయంలో మన వ్యవస్థ నిర్లక్ష్యం, ఇప్పుడు ఎలాంటి ‘మత్తు’గా సమాజానికి హానిచేసిందో చూడండి.