Home » లక్షల కోట్లు కంటైనర్లలో బయట దేశాలకు తరలిపోయింది

లక్షల కోట్లు కంటైనర్లలో బయట దేశాలకు తరలిపోయింది

• జగన్ రెడ్డి విదేశాలకు పారిపోవడానికి సిద్ధం అయ్యాడు
• జూన్ 4 వచ్చే ఫలితాలను చూసి జగన్ రెడ్డి, వైసీపీ గ్యాంగ్ షాక్ అవ్వబోతున్నారు
• జగన్ రెడ్డి భ్రమలు జూన్ 4 న తొలగబోతున్నాయి
• జగన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్య పోతుంది
• పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక ఐప్యాక్ తో జబ్బలు జరుసుకుంటున్నాడు
• బూత్ లలో కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ నేతలను నిలబెట్టడానికి జగన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు
• జగన్ రెడ్డి మాటలు విని అధికారులు తప్పు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

వైసీపీ నేతలతో మాట్లాడే ధైర్యం లేక ఐప్యాక్ దొంగల ముఠాతో గెలుస్తామంటూ జబ్బలు జరుచుకుంటూ జగన్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నాడు. తొత్తులుగా ఉన్న అధికారులతో చేసిన తప్పులను తుడిచేసి దోచుకున్న లక్షల కోట్లతో విదేశాలకు పారిపోవడానికి జగన్ రెడ్డి సిద్ధం అయ్యాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధానకార్యాలయంలో ఆయన మాట్లాడారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. జూన్ 4న వచ్చే ఫలితాలను చూసి జగన్ రెడ్డి, వైసీపీ గ్యాంగ్ షాక్ అవ్వబోతున్నారు. జగన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్య పోతుంది. రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. ఐదేళ్ల దౌర్జన్యాలు, లంచగొండి, అవినీతి, దుర్మార్గ పాలనను తరిమికొట్టడానికి దేశ విదేశాలనుండి, పక్క రాష్ట్రాల నుండి లక్షలాది మంది తరలివచ్చి మండుటెండలో క్యూలో నిలబడి ఓట్లు వేశారు. వైసీపీ నేతలు దాడులుకు దిగినా బయపడకుండా ఓట్లు వేశారు.

జగన్ రెడ్డి భ్రమలు జూన్ 4 న తొలగిపోతున్నాయి. జగన్ రెడ్డి ఐదేళ్లు ఏం చేసి అధికారంలోకి వస్తాడని కలలు కంటున్నాడు. పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్ తో జబ్బలు జరుసుకుంటున్నాడు. డబ్బాలు కొడుతున్నాడు. నాడు హిట్లర్ లాగే నేడు జగన్ మూడు రోజుల తరువాత బయటకు వచ్చి ఐప్యాక్ ముటాతో గొప్పలు పోతున్నాడు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి ఐప్యాక్ ముఠాకు కట్టబెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. తప్పుచేసిన వారు జైలుకు వెళ్లడం ఖాయం.

గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, బబాయిని గోడ్డలితో చంపిన ముద్దాల్ని కాపాడుతున్నందుకు వైసీపీని ప్రజలు గెలిపిస్తారా? నిత్యవసర ధరలు పెంచి పేదల రక్తాన్ని పీల్చి వేల కోట్లు రూపాయాల భారం వేసినందుకు జగన్ రెడ్డిని గెలిపిస్తారా? ఎస్సీఎస్టీసబ్ ప్లాన్ నిధులను మళ్లించి దళితులను వంచించినందుకు వైసీపీని గెలిపిస్తారా ?

అన్నా క్యాంటీన్ మూతేసి పేదల పొట్ట కొట్టినందుకు గెలపిస్తార? ఎందుకు గెలిపిస్తారు నిన్ను జగన్ రెడ్డి.? మద్యపాన నిషేదం చేస్తేనే ఓట్లు అడుగుతానని మాట ఇచ్చి మడతిప్పి నాసిరకం మద్యం అమ్మి 35 వేల మంది మహిళల మంగళ సూత్రాలు తెంపారు. అందుకు ఓట్లు వేస్తారా?. ఎందుకు ఈ మిడిసిపాటు జగన్ రెడ్డి.

కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఇసుక ధరలు అడ్డగోలుగా పెంచినందుకా మీరు గెలుస్తారని ఎగిరెగిరి పడుతున్నారు. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు, నిరుద్యోగులను మోసం చేశారు. రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులను దగా చేశాడు. పోలవరంను నట్టేట ముంచేసి, నదుల అనుసంధానంను గాలికి వదిలేశారు. రాయలసీమ ప్రాజెక్టులను గాలికొదిలేసి రాయలసీమ ద్రోహిగా జగన్ రెడ్డి ఉన్నాడు. అమరావతి రాజధానిని విధ్వంసం చేసి 3లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిర్వీర్యం చేశాడు. అమరావతి రైతాంగంపై ఎస్టీఎస్సీ కేసులు పెట్టి వారిని జైలు పాలు చేశాడు.

స్థానిక సంస్థలకు ఇచ్చిన 12 వేల కోట్లను పక్కదారి పట్టించాడు. ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ సెంటు పట్టాల్లో దాదాపు 8 లక్షల కోట్ల దోపీడి చేసిన వైసీపీ ని తరిమి కొట్టేందుకు ఓట్లు వేసిన జనసునామీలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. మళ్లీ ఏజెంట్లను నిలబెట్టుకోవడానికి దొంగల ముఠా ఐప్యాక్ వద్దకు వచ్చి జగన్ నాటకాలు ఆడుతున్నాడు. జగన్ రెడ్డి మాటలు నమ్మి వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కు పాల్పడితే వారి కుటుంబాలు రోడ్డున పడటం ఖాయం.

కూటమిని గెలిపించాలని ఓటర్లు పెద్ద ఎత్తున 82 శాతం ఓట్లు వేశారు. దాన్ని ఓర్వలేక జగన్ రెడ్డి 72 గంటల తరువాత బయటకు వచ్చి అబద్దపు ప్రచారం చేస్తున్నాడు. బూత్ లలో కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ నేతలను నిలబెట్టడానికి జగన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. జగన్ రెడ్డి లండన్ ప్యాకప్ అవుతున్నాడు. ఇప్పటి వరకు వైసీపీ కోసం పనిచసిన ఉద్యోగులను సజ్జల భార్గవ్ రెడ్డి తరిమికొట్టాడు. వారు రోడ్డున పడ్డారు. లక్షల కోట్లు కంటైనర్లలో బయట దేశాలకు తరలిపోయింది. ప్రవైటే ఐలాండ్స్ ను జగన్ రెడ్డి కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇవాళ జగన్ రెడ్డి సొంత చెల్లెళ్లే మేము కూడా గొడ్డలి బాధితులం అవుతామని ప్రజల ముందుకు వచ్చి చెబుతున్నారు. కన్న తల్లి అమెరికా పారిపోయింది. జగన్ రెడ్డి తన చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నాడు. ప్రజల నమ్మించడానికి నేడు మళ్లీ ఐప్యాక్ దొంగల ముఠాతో కలిసి మాయ మాటలు చెబుతున్నాడు. జగన్ రెడ్డి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

జగన్ కమీడియన్ గా ట్రై చేస్తే బెటరన్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. జగన్ రెడ్డి ఐప్యాక్ టీమ్ స్టాండప్ కమీడియన్ గా చేసింది. జగన్ మాటలు నమ్మడానికి నేడు ఎవరూ సిద్ధంగా లేరు. ఇవి ముందే తెలిసే రఘురామి రెడ్డి సీఐడీ కార్యాలయం ముందు తప్పుడు పత్రాలు ధ్వంసం చేయించాడు. నేడు కీలక ఈఫైల్స్ ను మాయం చేసేందుకు యత్నిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పుడు పత్రాలపై సమీక్షించడం జరుగుతుంది.

జగన్ రెడ్డి మాటలు నమ్మి అధికారులు తప్పు చేస్తే మూల్యం చెల్లించుకుంటారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సస్పెండ్ అవుతారు. పెద్దారెడ్డి మాటలు విని నేడు డీఎస్పీ చైతన్య దివ్యాంగుడు కిరణ్ పై దాడికి పాల్పడ్డారు. ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడకపోతే ఏపీ చీఫ్ సెక్రటరీని రాష్ట్రంలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ వివరణ కోరుతుంది. తాడేపల్లి కొంపలో ఉన్న సజ్జల, జగన్ రెడ్డి మాటలు విని అరాచకాలకు పాల్పడిన అధికారులను కాపాడటం ఎవరికీ సాధ్యం కాదు. వైసీపీ నేతల మాటలు విని అధికారులు తొందరపడి తప్పులు చేయవద్దు.

Leave a Reply