Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో మన్ కీ బాత్ ను వీక్షించిన లక్షలాది మంది

విజయవాడ: మన్ కీ బాత్ 100వ ఎపి సోడ్ ను ఎపిలో లక్షలాది మంది వీక్షించారు. ఎపి లో రికార్డు స్దాయిలో మన్ కీబాత్ ను వీక్షించారు.వివిధ జిల్లాల నుండి రాష్ట్ర కార్యాలయానికి అందుతున్న సమాచారం మేరకు చర్చిలు, మసీదులుతో పలు జైళ్ల లో ఖైదీలు కూడా మన్ కీ బాత్ ను వీక్షించారు. దాదాపుగా అన్ని కళాశాలల్లో కూడా విధ్యార్ధులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.

26 జిల్లాల్లో బిజెపి ఆధ్వర్యంలో మండల స్ధాయి, పోలింగ్ బూత్ స్ధాయిలో కూడా ఏర్పాట్లు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనసులో మాట కార్యక్రమానికి వందో ఎపి సోడ్ సందర్భంగా బిజెపి అగ్ర నేతలంతా ఏదో ఒక గ్రామంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలో వీక్షించడం తో ప్రజలంతా ఈరోజు మన్ కీ బాత్ వీక్షించడానికి పోటీ పడ్డారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, ఏలూరు. కర్నూలు, అనంతపురం, ఒంగోలు, తదితర ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో మన్ కీబాత్ వీక్షించే కేంద్రాలను భారీ స్ధాయిలో ఏర్పాటు చేశారు.

బిగ్ స్క్రీన్ లు ఏర్పాటు చేసి వివిధ రంగాల వారిని ఆహ్వానించారు. మచిలీపట్నంలో మత్ప్యకార సంఘాల ఆధ్వర్యంలో బిజెపి ఉపాధ్యక్షుడు చంద్రమౌళి ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురేందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి చేతుల మీదుగా మన్ కీ బాత్ అవార్డులను బహూకరించారు. మంగళగిరిలో చేనేత కార్మికుల సమక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మన్ కీ బాత్ ను వీక్షించారు. ఈ సందర్భంగా చేనేత మహిళా కార్మికుల సమస్యలను సోమువీర్రాజు స్వయంగా అడిగితెలుసుకున్నారు .

వీవర్స్ కాలనీ కి వచ్చి మన్ కీబాత్ వీక్షించిన సోమువీర్రాజును చేనేత కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కడప లో కూడా మన్ కీ బాత్ అధిక సంఖ్యలొ వీ క్షించారు .విజయవాడ నగరంలో నిర్వహించిన మన్ కీ బాత్ లో కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లు మన్ కీబాత్ ను వీక్షించారు.

విజయవాడ సిద్దార్ధ కళాశాలలో ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ లో బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మన్ కీ బాత్ నువీక్షించారు. భీమవరంలో రైల్యేస్టేషన్, మసీదు, చర్చిలలో కూడా మన్ కీ బాత్ ను బిజెపి రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస వర్మ నేతృత్వంలో నిర్వహించారు. ఒక్క భీమవరంలో నే 40 ప్రాంతాల్లో మన్ కీ బాత్ వీక్షించే కేంద్రాలను బిజెపి ఏర్పాటు చేసింది.

LEAVE A RESPONSE