జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు

పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్   పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఈ చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరం అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాల్లో  సుబ్బారాయుడు అనుభవం జనసేన విజయానికి దోహదం చేస్తుంది అన్నారు.

తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పని చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోనూ కీలకంగా పని చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. ఇటీవల జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సోమవారం మంచి రోజు కావడంతో జనసేన పార్టీలో చేరారు.

Leave a Reply