అంతర్జాతీయస్థాయి క్రికెటర్ కన్నా…వైసీపీ వీధి నేత పంతమే మిన్న!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆడుదాం ఆంధ్రా అంటే ఏమో అనుకున్నా…క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటం అని కొత్తగా తెలిసింది. జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి వైసిపి కార్పొరేటర్ పుత్రరత్నాన్ని పద్ధతి మార్చుకోవాలని మందలించడమే ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి చేసిన మహాపరాధం. భారత్ తరపున 16టెస్ట్ మ్యాచ్ లు ఆడి, ఆంధ్రా రంజీ జట్టుకు ఏడేళ్లు ఏకధాటి కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం వైసిపి వీధి నాయకుడి పంతం ముందు దిగదుడుపే.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించినపుడే ఎసిఎ పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. తాలిబాన్లను తలదన్నే వైసిపి విధ్వంసకపాలనలో ఇప్పటివరకు పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోవడం చూశాం… ఇప్పుడు అంబటిరాయుడు, హనుమ విహారి వంటి కొమ్ములు తిరిగిన క్రీడాకారులు కూడా పారిపోతున్నారు… వైకాపా నాయకులకు తిక్కరేగిందంటే అంతర్జాతీయస్థాయి క్రికెటర్ అయినా ఇంటికి పోవాల్సిందే…గట్లుంటది మనోళ్లతోటి!!

Leave a Reply