తెలుగు జాతి ముద్దుబిడ్డ, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామరావు గారి శతజయంతి వేడుకలు జర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఆదివారం అట్టహాసంగా జరిగాయి.
తెలుగుదేశం పార్టీ జర్మనీ ఆద్వర్యం లో 2018 నుంచి నాలుగుసార్లు మినీ మహానాడు జరుగగా ఆదివారం నాడు 5వ మినీ మహానాడు అంగరంగ వైభవంగా మునుపెన్నడూ లేని విధంగా జరిగింది .
ఈ కార్యక్రమంలో మొదటగా తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులు నందమూరి తారకరాముడికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి నీలిమ కుడితిపూడి గీసిన తారకరాముడి చిత్రపటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది .
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులు రాబోవు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి వారు చేయబోయే కృషిని తీర్మానాల ద్వారా సభకు వివరింపచేసారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా ఉరవకొండ ఎమ్మెల్యే మరియు ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మరియు టీ-టీడీపీ విభాగం తెలుగు మహిళ అధ్యక్షులు ప్రొఫెసర్ జ్యోత్స్నా తిరునగరి గారు వర్చ్యువల్ మీటింగ్ ద్వారా హాజరై తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సహం నింపారు.
ఆ తరువాత సభ్యులందరు పార్టీ కోసం ప్రాణం వదిలిన కార్యకర్తలకు, నాయకులకు సంతాపాన్ని ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం అని పేర్కొన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ జర్మనీ కుటుంబ సభ్యులతో పసుపు ప్రతిజ్ఞ చేపట్టారు.
ఈ కార్యక్రమం మొత్తం ‘జోహార్ అన్న ఎన్టీఆర్!’, ‘జై బాబు..జై జై బాబు!’ నినాదాలతో హోరెత్తింది.
ఈ కార్యక్రమంలో యువత ఎక్కువ సంఖ్యలో హాజరవ్వటం విశేషం. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విదేశీవిద్య పథకం ద్వారా ఎన్నో మధ్య మరియు పేద తరగతి కుటుంబాలకి ఎంతగానో ఉపయోగ పడి వారి కలలని సహకారం చేసిందని పేర్కొన్నారు. ఉన్నతవిద్యను అభ్యసించి అక్కడే కొలువులు పొందిన విషయాన్ని కొందరు గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం జర్మనీ విభాగం ముఖ్యసభ్యులైన శ్రీకాంత్, పవన్ కుర్రా, శివ, సుమంత్ కొర్రపాటి, అనిల్ మిక్కిలినేని, టిట్టు మద్దిపట్ల, నరేష్ కోనేరు, వంశీకృష్ణ దాసరి, వెంకట్ కాండ్ర నిర్వహించారు.