జగన్ రెడ్డి దగాకోరు,దోపిడీ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడు

135

మోసకారీ సంక్షేమంతో ప్రజల్ని వంచిస్తూ, వారిపై పన్నులభారంమోపుతూ, ఏపీని అప్పులఊబిలో నెట్టేసి, తన ఖజానా నింపుకుంటున్నాడు. అన్ని వర్గాలప్రజలకు అన్యాయం చేసిందికాక, సిగ్గులేకుండా సంబరాలు చేసుకుంటున్నారా?

వైసీపీప్రభుత్వ విధ్వంసపాలనలో, దుర్మార్గుడైన ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం నేరాలు ఘోరాలు, విధ్వంసాలు, వినాశనాలకు నెలవుగా మారిందని, వాటన్నింటిని వివరిస్తూ టీడీపీ ఒక ఛార్జ్ షీట్ (బుక్ లెట్) ను విడుదలచేస్తోందని, ‘మూడేళ్లమోసకారీపాలనలో 1111 విధ్వంసాలతో 30ఏళ్లు వెనక్కువెళ్లిన రాష్ట్రం’ పేరుతో అనేకఅంశాలను ప్రజలముందు ఉంచు తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుగారు తెలిపారు.సోమవారం ఆయన విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!

“ వైసీపీ విధ్వంసపాలన- దుర్మార్గపు ముఖ్యమంత్రి మోసకారీ సంక్షేమం, ప్రజలకు చేసిన వంచన, నేరాలుఘోరాలపై టీడీపీ చార్జిషీట్ విడుదలచేస్తున్నాం. 3ఏళ్లపాలనలో వైసీపీ ప్రజల్ని ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లుతాగించింది. మంచికార్యక్రమంతో పాలన ప్రారంభించాల్సిన జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతో ప్రారంభించాడు. ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసపాలనకు శ్రీకారంచుట్టాడు. చక్కగా ఉన్న ఇంటిని కూల్చేసి, తిరిగి దానికితానే పరిహారం ఇచ్చినట్లుగా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మార్చేశాడు.

మీటలునొక్కుతున్నామంటూ, మోసకారీ సంక్షేమంతో మూడేళ్లపాటు ప్రజల్ని దారుణంగా దోచుకున్నాడు. అధికారంలోకి వచ్చినవెంటనే తనసొంతపత్రికలో పనిచేసేవారిని సలహా దారులు, పీఆర్వోలుగా నియమించిన జగన్ ప్రజలసొమ్ముని అప్పనంగా వారికి దోచిపెడు తున్నాడు. గతంలో అన్నిప్రభుత్వాల్లో అమలైన పథకాలన్నీ, ఇప్పుడు ఈయనే కొత్తగా తీసుకొచ్చినట్లు ప్రకటనలరూపంలో సాక్షిపత్రికకు వందలకోట్లు తగలేశాడు శాసనసభలో ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ గురించి చెప్పాడు. రివర్స్ టెండరింగ్ అని ఏక్షణాన అన్నాడో గానీ, అప్పటినుంచి రాష్ట్రమే పూర్తిగా రివర్స్ అయ్యింది. రివర్స్ టెండరింగ్ తో రాష్ట్రంలోని సాగునీటిప్రాజెక్ట్ లను, నీటిపారుదలవ్యవస్థను సర్వనాశనంచేశాడు. కాంట్రాక్ట్ లన్నీ సొంతమనుషులకు ఇచ్చి, అప్పటికే పనులుచేస్తున్న వారిని తరిమికొట్టాడు. 2014 నుంచి 2019 వరకు సన్ రైజ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ కళకళలాడింది.

పోలవరం, అమరావతి నిర్మాణాలుసహా, విశాఖపట్నంలాంటి అనేక నగరాలు పరిశ్రమలరాకతో, కంపెనీల ఏర్పాటు తో కళకళలాడాయి. ఈ ప్రభుత్వంలో రాష్ట్రానికి, విశాఖలాంటి నగరాలకు ఒక్కపరిశ్రమ అయినా వచ్చిందా? ప్రతిపక్షనేతగా రాష్ట్రమంతా తిరిగిన జగన్, ఆనాడు బాదుడే బాదుడు అన్నాడు. చంద్రబాబు అన్నిధరలు పెంచాడని, పెట్రోల్ డీజిల్ సహా, వేటిధరలు ప్రజలకు అందుబాటులో లేవన్నాడు. అదే పెద్దమనిషి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్ని వీరబాదుడు బాదడం మొదలెట్టాడు. ప్రజలంతా మూడేళ్లు వెనక్కివెళ్లి, ఒక్కసారి రాష్ట్రంలో పరిస్థితులు, ధరలు, ఇతరత్రా పన్నులు అప్పుడెలా ఉన్నాయో, ఇప్పుడు ఎలాఉన్నాయో బేరీజు వేసుకోవాలి. చంద్రబాబు హయాంలో నిత్యావరాలు, ఇతరవస్తువుల ధరలు ఎలాఉన్నాయో, ఇప్పుడెలా ఉన్నాయో ఆలోచించాలి. కేంద్రం పెట్రోల్ డీజిల్ పై సెస్సుతగ్గించినా, ఏపీప్రభుత్వం మాత్రం పైసా తగ్గించలేదు.

దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు 5సార్లుపెంచి, ప్రజలపై మూడేళ్లలోనే రూ.46వేలకోట్ల భారం మోపారు. గ్రామాలు, పట్టణాల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితి. ఏప్రియల్ లో ఎంత కరెంట్ బిల్ వచ్చిందో, ఇప్పుడు ఎంతొస్తుందో ప్రజలంతా ఆలోచించాలి. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రే ఆ పని చేసి రాష్ట్రం పరువు తీశాడు. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలుపెంచాడు, చెత్తపన్నువేశాడు. ఆ పన్ను కట్టని వారి ఇళ్ల ముందు చెత్తపోయించాడు. అంతకంటే నీతిమాలిన పని ఉంటుందా?

రాష్ట్రంలో అరాచక, కక్షసాధింపు పాలనే సాగుతోంది. టీడీపీ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకొని, వారు బయటకువస్తేనే ఊరుకోమంటూ తప్పుడుకేసులు పెట్టారు. టీడీపీనేతల ఆర్థికమూలాలు దెబ్బతీశారు. ఇంటింటికీ వైసీపీ అని తరువాత ప్రజలు తరిమికొడతారేమోనన్న భయంతో ఇంటింటికీ మనప్రభుత్వం అని పేరుమార్చారు. ఏ పేరుతో వెళ్లినా ప్రభుత్వపెద్దలకు, వైసీపీవారికి ప్రజల ఛీత్కారాలు తప్పలేదు. సామాజిక బస్సు యాత్ర పేరుతో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చినట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. రాష్ట్రజనాభాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు 70శాతం ఉంటే, వారిలో ఎవరో ఒకరిద్దరికి మంత్రిపదవులు ఇవ్వడం వారికి సామాజికన్యాయం చేసినట్లు అవుతుందా? ఆయావర్గాలన్నీ ప్రశాంతంగా బతకడానికి భయపడేలాచేసి, వారికి బతుకే లేకుండా చేసిన జగన్, సామాజికన్యాయం చేశాడా? పదిమంది బీసీ మంత్రులున్నారని గొప్పలు చెబుతున్నారు.

టీడీపీహాయాంలో 103సీట్లు గెలిస్తే, 9మంది బీసీలకు మంత్రి పదవులుఇచ్చాము. 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి 10మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం సామాజికన్యాయమా… 103సీట్లు గెలిచి, 9మందిని మంత్రుల్నిచేయడం సామాజిక న్యాయమా? ప్రభుత్వంలోని బీసీమంత్రులంతా నోరులేని మూగజీవుల్లా బతుకుతున్నారు. వారికి మంత్రిపదవులిచ్చిన జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, వేమిరెడ్డిప్రభాకర్ రెడ్డిలకు రాసిచ్చాడు. పెత్తనం ఆనలుగురు చేస్తుంటే, మంత్రులు బస్సుల్లో తిరుగుతూ, సామాజికన్యాయం అని మాట్లాడుతూ, బీసీలు, ఎస్సీ,ఎస్టీలు, మైనారిటీల పరువు తీస్తున్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులు, బీసీలు, మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు, వారిని దారుణంగా చంపేసినప్పుడు మంత్రులెవరైనా నోరుతెరిచారా? ఏనాడైనా ఏమిటీ దారుణమని గొంతెత్తారా? చంద్రబాబుగారిహాయాంలో బీసీలకు విదేశీవిద్య, ఆదరణ, విద్యోన్నతి, చంద్రన్నబీమా, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలివ్వడం వంటి పథకాలు అమలయ్యాయి.

తాడేపల్లి ప్యాలెస్ లో సంబరాలు చేస్తున్న ఈ ప్రభుత్వం, మూడేళ్లలో ఒక్క బీసీ విద్యార్థికి అయినా రూపాయి ఇచ్చిందా? టీడీపీ హాయాంలో ఆదరణ పథకం కింద బీసీలకు మంజూరుచేసిన పరికరాలు గోడౌన్లలో మగ్గిపోతుంటే, ఒక్క బీసీ మంత్రయినా వాటిని అర్హులకు ఇచ్చారా? ఎస్సీ మంత్రులు ఎవరైనా సరే, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎందరు దళితులకు మేలుజరిగిందని ఎప్పుడైనా ఆలోచించారా? ఏ దళితుడికైనా ఈ ప్రభుత్వంలో రూపాయి స్వయంఉపాధి రుణం అందిందా? అలా ఇచ్చామని ఏ దళిత మంత్రి అయినా చెప్పగలడా? 58 కార్పొరేషన్లు ఇచ్చామంటున్నారు.. ఆ పదవులు ఎందుకు నాలుక గీసుకోవడానికా? ఆ కార్పొరేషన్ల ఛైర్మన్లకు కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయా?

ఈ మూడేళ్లలో ఆయాకార్పొరేషన్ల ఛైర్మన్లు ఎవరైనా ప్రభుత్వంనుంచి తమకు ఈ రూపాయి వచ్చిందని చెప్పగలరా? వైసీపీప్రభుత్వంలోని కార్పొరేషన్లతో ఒక్క విద్యావంతుడు, ఒక్క నిరుద్యోగికి అయినా రూపాయి ఇచ్చినట్లు నిరూపిస్తే, నేను రాజకీయాలనుంచే తప్పుకుంటాను. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మైనారిటీలకు న్యాయం చేశామంటూ చేపట్టిన బస్సుయాత్ర ఏమైందో చూశారుగా! తనకేసుల్లో రెండోముద్దాయిగా ఉన్నవ్యక్తికి, 4వ, 5 ముద్దాయిలుగా ఉన్నవారికి జగన్ రాజ్యసభసీట్లు ఇచ్చాడు. 8 రాజ్యసభ స్థానాలు వైసీపీకి వస్తే, వాటిలో 3స్థానాలు తనతోపాటు కేసుల్లోఉన్నవారికే ముఖ్యమంత్రి ఇచ్చాడో లేదో చెప్పమనండి. మిగిలిన 5స్థానాల్లో ఒకటి జగన్ కేసుల వాదించే తెలంగాణ లాయర్ నిరంజన్ రెడ్డికి ఒకటిచ్చాడు.

టీడీపీ నుంచి వెళ్లిన బీదమస్తాన్ రావుకి, పొరుగురాష్ట్రంలో బీసీనేతను అనిచెప్పుకుంటున్న ఉద్ధందుడికి ఇచ్చాడు. బీసీ జాతీయనాయకుడికి రాజ్యసభస్థానం ఇచ్చామంటున్నవారంతా, తెలంగాణలో బీసీల్లోని 12కులాలను ఓసీల్లో కలిపినదానిపై ఎందుకు మాట్లాడరు? వైసీపీ రాజ్యసభ సభ్యుడైన కృష్ణయ్య తెలంగాణలోని బీసీలను ఓసీల్లో కలిపిన దానిపై ఏనాడైనా కేసీఆర్ తో మాట్లాడాడా? ఇలాంటి వాళ్లందరికీ రాజ్యసభ పదవులిచ్చి, బీసీలకు ఇచ్చామంటారా? జగన్ రెడ్డి ఉత్తరాంధ్రకు ఒక్క రాజ్యసభసీటుకూడా ఎందుకివ్వలేదు? రాయలసీమలో రాజ్యసభకు వెళ్లే అర్హత ఎవరికీ లేదని ముఖ్యమంత్రి భావించాడా? అన్నివర్గాలకు, అన్నికులాలకు, అన్ని ప్రాంతాలకు న్యాయంచేశామని డబ్బాలు కొట్టుకుంటున్నారు.

రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా నిలపడమేనా, జగన్ రెడ్డి అన్నదాతలకు చేసిన మేలు? రైతుభరోసాకింద ప్రతి రైతుకి రూ.14,500 ఇస్తాననిచెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక 7వేలు ఇస్తూ వారిని మోసంచేయలేదా? డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్లు, ఇతర యంత్రపరికరాలు ఏవైనా తనపాలనలో సబ్సిడీపై, రైతులకు ఇచ్చాడా? టీడీపీ హాయాంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీలు, పంటలబీమా సాయం, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీలు అందించాం. జగన్ రెడ్డి వచ్చాక పంటలబీమా సొమ్ము సకాలంలో కట్టక అన్నదాతలు నష్టపోలేదా? ధాన్యం కొని 6, 7నెలలైనా రైతులకు డబ్బులు ఇవ్వని ఈ ప్రభుత్వం, రైతుల్ని ఆదుకుందా?

భారతదేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో మహిళలపై అత్యాచా రాలు, అఘాయిత్యాలు జరగడమేనా మహిళలకు ముఖ్యమంత్రి చేసినమేలు? ముఖ్యమంత్రి ఇంటిపక్కనే అత్యాచారంజరిగినా, రాష్ట్రంలో రోజుకో మూల మహిళలు, చిన్నారులపై దారుణాలు జరుగుతున్నా ఏనాడైనా స్పందించారా? ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కల్పించలేని ముఖ్యమంత్రికి ఆ పదవిఎందుకు? ఏపీలో ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు పడకేశాయి. మందులు, పడకలు, ఇంజక్షన్లు లేక రోగులు నానాఅవస్థలుపడుతున్నది నిజంకాదా? తండ్రి తనకుమారుడి శవాన్ని మోటార్ సైకిల్ పై తీసుకెళ్లింది నిజంకాదా? శవాల్ని తరలించడానికి ప్రభుత్వాసుపత్రుల అంబులెన్స్ ల డ్రైవర్లు, బాధితుల్ని వేధించడంలేదా? గర్భిణికి ప్రసవంచేయడానికి వైద్యులు సెల్ ఫోన్ వెలుతురిని నమ్ముకోలేదా? నాడు-నేడు అని విద్యారంగాన్ని నాశనంచేసిన ముఖ్యమంత్రి, రూ.5వేలకోట్ల దిగమింగాడు. గ్రామాల్లో పాఠశాలలకు రంగులేసి, చివరకు రేషనలైజేషన్ పేరుతో ఆ పాఠశాలలే లేకుండా చేశాడు.

పేద విద్యార్థులకు అవసరమైన పాఠశాలలు తీసేయాలనుకున్నప్పుడు వాటికి రంగులేసి, వేలకోట్లు ఎందుకు తగలేశారు? స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు నామ రూపాలు లేకుండాచేశారు. 30లక్షల ఇళ్లు కడతామని మేనిఫెస్టోలో పెట్టిన జగన్ రెడ్డి, మూడేళ్లలో మూడు ఇళ్లుకట్టాడని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. ట్రాక్టర్ ఇసుక, సిమెంట్, స్టీల్ అన్నిధరలుపెంచితే, పేదలు ఇళ్లుకట్టుకోగలరా? మద్యపాన నిషేధం చేస్తానని, చంద్రబాబు మద్యం అమ్మకాలతో ప్రజల జీవితాలు నాశనంచేస్తున్నాడని అన్నది ఈ ముఖ్యమంత్రి కాదా? ఆ మాట తాను అనలేదని చెబితే, నేను ఉరేసుకుంటాను.

మద్యపాన నిషేధం అనిచెప్పిన జగన్ , మద్యంఅమ్మకాలు, తయారీకూడా తానుచేస్తూ, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నది వాస్తవంకాదా? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలతో కోట్లుదోచుకుంటూ, ప్రజలప్రాణాలు తీస్తున్నది కాక గొప్పలు చెప్పుకుంటున్నాడు. దేశంలో దొరికే ప్రముఖ మద్యంబ్రాండ్లు రాష్ట్రంలో ఎందుకు లేవో ముఖ్యమంత్రి చెప్పాలి? చంద్రబాబు హయాంలో మద్యం సరఫరాచేసే కంపెనీలకు, క్వార్టర్ బాటిల్ కు రూ.7లు చెల్లిస్తే, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అదేబాటిల్ కు రూ.27 ఇస్తున్నాడు. క్వార్టర్ మద్యంకొనే ప్రతివ్యక్తినుంచీ రూ.20లు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికే వెళ్తోంది. ఏటా రూ.5 నుంచి రూ.6వేలకోట్లచొప్పున మద్యంపై ముఖ్యమంత్రి ఈ మూడేళ్లలో ఎంత దోచేశాడో చూడండి. ఇసుక అమ్మకాలు ఎవరు చేస్తున్నారు? ఎక్కడైనా ప్రజలకు ఇసుక అందుబాటులోఉందా? మద్యం అమ్మకాలు బయటివాళ్లుచేయాలి.. ఇసుకఅమ్మకం ప్రభుత్వం చూడాలి.. కానీ జగన్ దాన్ని రివర్స్ చేశాడు.

రద్దు చేసిన ఒప్పందాలు తిరిగి చేసుకోవడానికి దావోస్ వరకు వెళ్లాలా?
జగన్ రెడ్డి దావోస్ వెళ్లాడు.. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని యువత ఆత్రుతగా ఎదురుచూశారు. అదానీ డేటా సెంటర్ టీడీపీహాయాంలో రాష్ట్రానికివస్తే, దాన్నిరద్దుచేసిన జగన్ ఇప్పుడు కొత్తగా దావోస్ వెళ్లి, మరలా అదేఒప్పందాన్ని కొత్తగాచేసుకున్నాడు. అదానీని కలవడానికి జగన్ దావోస్ వెళ్లాలా? ఢిల్లీవెళితే సరిపోదా? జగన్మోహన్ రెడ్డి ప్రారంభించానంటున్న కర్నూలు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్, చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందంకాదా? దానికి సంబంధించి కూడా దావోస్ లో మరలాకొత్తగా ఒప్పందం చేసుకున్నారు. ప్రారంభమైన కంపెనీకి దావోస్ లో ఒప్పందం చేసుకుంటూ ప్రజలకు కలరింగ్ ఇవ్వడం మోసంకాదా? చంద్రబాబు హయంలో జరిగిన ఒప్పందాలు రద్దుచేయడం ఎందుకు… తిరిగి వాటినే కొత్తగా ఇప్పుడు ప్రారంభించడం ఎందుకు?

3లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నాయన్న జగన్ రెడ్డి, 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటి?
చంద్రబాబు హయాంలో ప్రభుత్వశాఖల్లో 3లక్షలకు పైగా ఖాళీలుఉన్నాయని చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక వాటినెందుకు భర్తీచేయలేదు? ఏపీపీఎస్సీ ద్వారా 100పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులుదులుపుకోవడం ముఖ్యమంత్రి యువతకుచేసిన మోసంకాదా? ఏటా జాబ్ క్యాలెండర్ అని జగన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయలేదా? ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదలచేసి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు? చంద్రబాబు హయాంలో యువతకు ఐటీఉద్యోగాలు వస్తే, ఈయనొచ్చాక వాలంటీర్ ఉద్యోగాలిచ్చాడు. అవిచాలవన్నట్లు, మటన్, చికెన్ కొట్లలో ఉద్యోగాలు ఇచ్చాడు.

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డి, యువత జీవితాలను నాశనం చేశాడు. డైవర్షన్ ముఖ్యమంత్రిగా పేరుపొందిన జగన్ రెడ్డి, ఏదైనా ఇష్యూవస్తే వెంటనే ప్రజల్ని దారి మళ్లిస్తున్నాడు. వైసీపీఎమ్మెల్సీ తనవద్ద డ్రైవర్ గాపనిచేసిన వ్యక్తిని చంపి, శవాన్ని నేరుగా ఇంటికే తీసుకెళితే, దాన్నుంచిప్రజల దృష్టి మళ్లించడానికి కోనసీమలో చిచ్చుపెట్టాడు. కోనసీమలో జరిగిన విధ్వంసం, అంతా ముఖ్యమంత్రి చేయించిందే. తనప్రభుత్వంలోని మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు తగలబడుతున్నా ఒక్క ఫైరింజన్ కూడా ఎందుకు రాలేదు? గతంలో రాజశేఖర్ రెడ్డి , హైదరాబాద్ లో ఇలానే మతకలహాలు సృష్టించి, 200మంది చావుకి కారణమయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం రిలయన్స్ వారే తనతండ్రిని చంపారని ప్రజల్ని రెచ్చగొట్టి, అమాయకులైన యువత జీవితాలతో ఆడుకోలేదా?

ఎన్నికలకు ముందు ఈయన ఆడిన కోడికత్తి డ్రామాఏమైంది? ఆపనిచేసినవాడిని అధికారంలోకి వచ్చాక ఎందుకు శిక్షించలేదు? ఎన్నికల్లో ఓట్లుదండుకోవడానికి ఆఖరికి సొంతబాబాయ్ ని చంపించలేదా? గొడ్డలిపోటుతో చంపేసి, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించలేదా? బాబాయ్ హత్యకేసుని విచారిస్తున్న సీబీఐ అధికారుల్ని చంపేస్తామని, వారికార్లపై, వారి నివాసాలపై బాంబులేస్తామని బెదిరిస్తారా? సీబీఐ వారిని తనపార్టీవ్యక్తులే బెదిరిస్తున్నా జగన్ రెడ్డిలో చలనంరాలేదు విభజనచట్టంప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిగురించి జగన్ రెడ్డి ఏనాడైనా ఢిల్లీలో మాట్లాడాడా? ప్రధానితో చర్చించి ఈ మూడేళ్లలో ఏమైనా రాష్ట్రానికి సాధించాడా? ఆంధ్రప్రదేశ్ హక్కు అయిన విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నా ఈయనెందుకు నోరుతెరవడంలేదు? మూడేళ్లపాలనలోనే ఇంతగా ప్రజావ్యతిరేకత పొందిన ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం. ఈ విధంగా నేరస్థుడైన వ్యక్తి పాలనలో ప్రజలు ఎన్నివిధాలా నష్టపోయారో ఆలోచించాలి.

ఇలా అన్నింటిలో, అన్నివర్గాలను మోసగించిన ముఖ్యమంత్రిని ఎంతకాలం భరించాలి? ముఖ్యమంత్రి దురాగతాలు, ఈ ప్రభుత్వ దుర్మార్గాలు పాపాల గురించి మాపార్టీ తరుపున విడుదలచేసిన చార్జ్ షీట్ లో 1111 అంశాలున్నాయి. ఇంకా ఉంటాయి.. వాటిగురించి కూడా ప్రజలకు అర్థమయ్యేలా పూర్తి వాస్తవాలతో వివరిస్తాం. రెవెన్యూ మంత్రిగా ఉన్న మనిషి ప్రజల్ని అలా అనవచ్చా? డబ్బులిస్తే ప్రజలు ఏమీ అడగకూడదా? ప్రజలకు బతుకే లేకుండాచేసిన ముఖ్యమంత్రి, మంత్రులు వారిని సేచ్ఛగా, సంతోషంగా ఉండనిచ్చారా? మూడేళ్లలోనే రూ.8లక్షలకోట్ల అప్పుచేశారు. ఇంకోరెండేళ్లు ఉంటే రూ.11లక్షలకోట్లు చేస్తారు. ఎవరుతీర్చాలి అదంతా? ప్రజలు ఎంతభారం మోయాలి? ఎంతకాలం మోయాలి? చంద్రబాబుగారి హయాంలో 2014లో రూ.87వేలకోట్లు బడ్జెట్ లో కేటాయిస్తే, దానిలో 53శాతం సొమ్ముని ప్రజలసంక్షేమానికి వినియోగించాము. ఈ లెక్కలు మేంచెప్పడం కాదు.. ఇప్పటికీ రికార్డుల్లో ఉంటుంది.

జగన్ రెడ్డి రూ.లక్షా57వేలకోట్ల బడ్జెట్ పెట్టి, దానిలో సంక్షేమానికి వినియోగించింది కేవలం 42శాతం మాత్రమే. టీడీపీహయాంలో తక్కువ బడ్జెట్ లో ఎక్కువమొత్తాన్ని సంక్షేమానికి వినియోగిస్తే, ఈ ప్రభుత్వంలో ఎక్కవబడ్జెట్ పెట్టి, సంక్షేమానికి తక్కువఖర్చుపెట్టడం మోసకారీ సంక్షేమం కాదా? ఏం ఉద్ధరించారని వైసీపీవారుసంబరాలు చేస్తున్నారు? ప్రజలజీవితాలనునాశనం చేసినందుకా… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకా?… దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, బీసీలపై వేధింపులు చేసినందుకా…? రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకా? రాష్ట్రచరిత్రలో దివాలాకోరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతాడు. ఎన్టీఆర్ ఫోటో వేసుకునేఅర్హత వైసీపీకి ఉందా? జిల్లాకు పేరుపెడితే ఆయన్ని స్మరించినట్టా? ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది టీడీపీకాదా? కేంద్రప్రభుత్వంలో ప్రస్తావించింది ఎవరు? ఎన్టీఆర్ తో ఒక ముఠానాయకుడికి, దొంగకు, దోపిడీదారుకి పోలికా? మహానాడుని అడ్డుకోవడానికి చేయాల్సిన ఆకృత్యాలు అన్నీచేశారుగా…ఏమైంది. ఏమైనా ఆపగలిగారా?”

కుక్కలు పిచ్చికుక్కలు నన్ను ఉద్దేశించి అరుస్తుంటాయి.. వాటికి సమాధానంచెప్పాల్సిన అవసరం నాకులేదు. (దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖల్యపై విలేకరులు వివరణకోరిన దానికి అచ్చెన్నాయుడి గారి స్పందన) ”