భీమవరం అంటే సొమ్ము ఎగవేసే వారు?

– మంత్రి శ్రీ రంగనాథ రాజు
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఇక్కడి ప్రజలు సొమ్ములు ఎగ్గొట్టే వారు ఎక్కువగా ఉంటారని అర్ధంవచ్చేలా వ్యాఖ్యానించారు.
“భీమవరం గురించి అందరూ చెప్పుకుంటారు.భీమవరం అంటే చేపలు.. రొయ్యలు.. పీతలు.. కోడి పుంజులు.. పందాలు ..సొమ్ము ఎగవేసే వారు ఉన్నారు అంటూ పరోక్షంగా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు చర్చనీయాంశం అయింది.
భీమవరంలో కృష్ణాజిల్గాకు చెందిన ఆక్వాఫీడ్ కంపెనీ ప్రభుత్వఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి రంగనాధరాజు ప్రారంభించారు..ఈ సంధర్భంలో ఇక్కడ చాలామంది డబ్బున్నవారు దాతలున్నారని..కానీ కృష్ణాజిల్లా నుంచి వచ్చిన సుబ్రమణ్యం ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయటం అభినందించారు.
‘ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా భీమవరం గురించి చెప్పుకుంటారు… అసలు భీమవరానికి కోడిపుంజులు ఉన్నాయా..? ఏమన్నా మోషేను తయారు చేశాడా? భీమవరం జాతి అంటే బాగా ఎగ్గొడతారా పార్టీకి.!”


అన్నారు..దీంతో వేదికపై ఉన్న ఎమ్మేల్యే గ్రంధితో సహా అంతా గొల్బున నవ్వారు.దీనికి శాసనమండలి సభ్యుడు కొయ్యే మోషేను రాజు “కోడి పుంజులు భీమవరం జాతి పుంజులు అని… భీమవరం వాళ్లందర్నీ ఆదుకుంటారని”అంటూ స్పందించారు.

Leave a Reply