అందరికీ ఒకే చట్టం చేయాలి

-చట్టాలలో మార్పు రావాలి
– రాజ్యాంగాన్ని సవరించాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన ఒక వ్యక్తి 20 సం. ల తరువాత, అది తప్పుడు కేసు అని తేలడంతో రెండు రోజుల క్రితం విడుదల అయ్యాడు. అంటే అతని జీవితం మొత్తం ఒక తప్పుడు కేసు వలన నాశనం అయిపోయింది.
ఏ వర్గానికైనా, మరొక వర్గాన్ని బాధించే అవకాశం సామాజికంగానో లేదా చట్టం వల్లనో లేదా మరో రకంగానో లభిస్తే దానిని ఉపయోగించుకుని, అవతలి వర్గం వారిని బాధించే వారు అన్ని వర్గాలలో ఉంటారు. అది బ్రాహ్మణులు కావచ్చు, మాలలు కావచ్చు, రెడ్లు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, తెల్లవారు కావచ్చు, నల్లవారు కావచ్చు లేదా మరే వర్గం వారైనా కావచ్చు. ఒకవర్గానికి మరొక వర్గాన్ని బాధించే అవకాశం గతంలో ఉంది కనుక, అప్పట్లో బాధకు గురి అయిన వర్గానికి, బాధకు గురిచేసిన వర్గాన్ని బాధించే అవకాశం ఇప్పుడు ఇవ్వాలి అనడం అధర్మం అలానే సమస్యను శాశ్వతం చెయ్యడం.
గతంలో అగ్రవర్ణాలుగా చెలామణీ అయిన వారు ఎస్సీ, ఎస్టీలను అలానే పురుషులు స్త్రీలను, అప్పట్లో తమకి ఉన్న సామాజిక అనుకూలతలను ఉపయోగించుకుని ఇబ్బందులకు గురిచేశారు అనేది నిజం అనుకున్నా ఇప్పుడు ఆ అవకాశాన్ని స్త్రీలకి లేదా ఎస్సీ, ఎస్టీలకు సామాజికంగా లేదా చట్టాన్ని ఉపయోగించి కల్పించాలి అనడం అధర్మం. నిజంగా సమాజం మేలు కోరేవారైతే ఏ వర్గమూ మరో వర్గాన్ని ఇబ్బందులు పెట్టకుండా ఉండే వ్యవస్థ గురించి కృషి చేస్తుందే తప్ప, గతంలో పీడనకు గురియైన వర్గం వారికి తమ వర్గం వారిని గతంలో పీడించిన వర్గం వారిని పీడించే అవకాశం కల్పించాలి అని చూడడు.
పైగా ఇటువంటి సామాజిక, చట్టబద్దమైన చర్యలు ఈ వర్గాల మధ్య శాశ్వత శత్రుత్వాన్ని కలుగచేస్తాయి. అది ఆ వర్గాలకూ మంచిది కాదు, మొత్తంగా సమాజానికీ మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించి మోపే అభియోగాలలో (కేసులలో) 40% అబద్ధపు కేసులే – రాజస్థాన్ పోలీస్
ఢిల్లీ నగరంలో పురుషులపై స్త్రీలు మోపుతున్న మానభంగం అభియోగాలలో (రేప్ కేసులు) దాదాపు 80% దొంగ అభియోగాలే – దీ హిందూ దినపత్రిక
చట్టం ఎప్పుడూ ధర్మానికి అనుగుణంగా ఉండాలే కానీ, ఇలా ఒకవర్గాన్ని నాశనం చెయ్యడానికి మరో వర్గానికి అవకాశం కల్పించేదిగా ఉండకూడదు. దీనివలన ఒక వర్గం వారిపై మరొక వర్గం వారిలో ద్వేషం ఏర్పడటం తప్ప, వేరే ఏ ప్రయోజనమూ ఉండదు. ఈ ద్వేషం మన దేశానికి మంచిది కాదు. దీనిని మంచి మనస్సుతో అందరూ అర్థం చేసుకుంటాను అని ఆశిస్తున్నాను.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695