Suryaa.co.in

Telangana

ప్రియాంక గాంధీ విజయం పట్ల మంత్రి తుమ్మల హర్షం

హైదరాబాద్: కేరళలో వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘనవిజయం సాధించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. వయనాడ్ ప్రజల తీర్పు అమోఘం అన్నారు. మొదటి సారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరెగంట్రం చేసిన ప్రియాంక గాంధీ అత్యధిక మెజరిటీతో ఘన విజయం సాధించడం పట్ల అక్కడి ప్రజలు గాంధీ కుటుంబం పట్ల, నెహ్రూ వారసత్వం పట్ల ఎంత విధేయత చూపుతున్నారో మరో మారు నిరూపితం అయిందన్నారు.

వయనాడ్ లో రాహుల్ గాంధీ రికార్డును ప్రియాంక గాంధీ బ్రేక్ చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. విద్యా వంతులైన కేరళ ప్రజలు కాంగ్రెస్ కు అండగా ఉండటం వారిపట్ల గౌరవాన్ని, నమ్మకాన్ని సూచిస్తుందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కు గాంధీ కుటుంబంతోనే సాధ్యం అని కేరళ ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ప్రియాంకా గాంధీ కి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన వయనాడ్ ప్రజలకు తెలంగాణ ప్రజల తరఫున మంత్రి తుమ్మల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A RESPONSE