రామచంద్రపురం : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, కృష్ణాజిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను రామచంద్రపురం నియోజకవర్గంలోని పలువురు దళిత నాయకులు సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు రవ్వా భూషణం మాట్లాడుతూ కృష్ణ జిల్లాలోని ఎమ్మెల్యేలను, ఎంపీలను, అధికారులును, కూటమి నాయకులను సమన్వయ పరచి కృష్ణాజిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించటం రాష్ట్ర ప్రజలకు, రామచంద్రపురం నియోజవర్గ ప్రజలకు గర్వకారణం అన్నారు.
ప్రభుత్వ పథకాల అమలులో, జిల్లాలోని అధికారులు, రాజకీయ నాయకులును సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కృష్ణాజిల్లాను నిలిపినందుకు మంత్రి సుభాష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు దక్కటం, ఆయన కష్టానికి నిదర్శనం అన్నారు. అనంతరం దళిత నాయకులు రవ్వా భూషణం ఆధ్వర్యంలో మంత్రి సుభాష్ ను అభినందించి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ దళిత నాయకులు రవ్వా భూషణం, ద్రాక్షారామ పంచాయతీ సర్పంచ్ అరుణ్, పిల్లి నాగు, మేడిశెట్టి వాడపల్లి తోట వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.