– మంత్రి సుభాష్
– 4 సభ్యులతో వైదిక కమిటీ ఏర్పాటు
ద్రాక్షారామం: శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ద్రాక్షారామంలో వచ్చేనెల ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు జరుగు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ , దేవస్థాన కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు, అభిషేక పురోహితులు, చండీ పారాయణదారులు, ఆలయ సిబ్బంది, భక్తులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నలుగురు దేవస్థాన సభ్యులకు వైదిక కమిటీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కమిటీ దేవస్థానంలో జరిగే ప్రతి వైదిక కార్యక్రమంలో ముహూర్తములు, విధి విధానాలను నిర్ణయిస్తారని కార్యనిర్వాహణాధికారిణి తెలియజేస్తున్నారు. ఎన్నడూ జరగ నటువంటి విధముగా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలు జరపాలని మంత్రి సుభాష్ ఆదేశించారు. అనంతరం రధంను బయటకు తీసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం , ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.