సీఎం మేనమామా మజాకా?

– గడప గడపలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అసహనం

వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయునిపల్లెలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని ప్రజలు పలు సమస్యలపై ప్రశ్నించారు.సమాధానం చెప్పలేక అసహనానికి గురైన ఎమ్మెల్యే బూతులు తిడుతూ ప్రజలపై మండిపడ్డారు.

ఆయన ముఖ్యమంత్రికి స్వయానా మేనమామ.. తమ ప్రభుత్వం చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడపగడపకు కార్యక్రమంలో పర్యటిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం చేసే గొప్పలు చెప్పుకునేందుకు వెళ్లిన ఆయనకు.. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది. వెళ్లిన ప్రతిచోట ప్రశ్నల వర్షం కురవడంతో.. సహనం నశించిన ఆయన బూతు పురాణం మెుదలెట్టారు.ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలపై పదేపదే ప్రశ్నలు అడిగారు. వీటికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అసహనంతో దుర్భాషలాడారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇది చూసినవాళ్లు స్వయానా ముఖ్యమంత్రి మేనమామే ఇలా ప్రవర్తించడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు.