Suryaa.co.in

Andhra Pradesh

చదువుకోండి… ఆర్థిక సమస్య అడ్డొస్తే అండగా ఉంటా…

– ఇద్దరికి రూ.75 వేల సాయం
– విద్యార్థులకు ఎమ్మెల్యే ‘యరపతినేని’ భరోసా

గురజాల: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మరొకసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తున్నారు. దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన పందిటి సుమంత్ కుమార్ నీట్ లో జాతీయ స్థాయి అర్హత సాధించి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని తెలుసుకొని వారికి చదువు నిమిత్తం రూ. 50,000 అందజేశారు. అంతేకాకుండా ఐదు సంవత్సరాలకు 2,50,000 రూపాయలు ఇస్తానని భరోసా ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి చెరుకుపల్లి నవదీప్ కు రూ. 25,000 ఆర్థిక సహాయం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో యువకులు మంచి చదువు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఎవరు అధైర్య పడవద్దని అర్హత ఉన్నా ఆర్థిక సమస్యలు చుట్టుముడితే అండగా ఉంటానని ఎమ్మెల్యే యరపతినేని భరోసానిచ్చారు.

LEAVE A RESPONSE