Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య కేసుపై ఎమ్మెల్సీ బిటెక్ రవి సంచలన వ్యాఖ్యలు..

దస్తగిరి వాగ్మూలం ప్రకారం దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లను ఎందుకు అరెస్ట్ చేయలేదు.ఎందుకు వారిపై చార్జిషీట్ దాఖలు చేయడం లేదు.రెండవ చార్జిషీట్ లో 5వ నిందితుడిగా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని చేర్చారు.దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి 80వ రోజులైనా ఎందుకు అవినాష్, భాస్కర్ రెడ్డి లను అరెస్ట్ చేయరు.సామాన్యులకైనా రాజకీయ నాయకులకైనా ఒకటే న్యాయం.

సీఎం డిల్లీకి వెళ్ళి వచ్చాకే కేసు విచారణ నెమ్మదిగా సాగుతోంది.ఇది పులివెందుల ప్రజల్లో చర్చ సాగుతోంది.కేసును నీరుగార్చేందుకు జగన్ ప్రయత్నాలు.సీబీఐ అధికారులు ఆరోపణలు ఉన్న వ్యక్తులపై చార్జిషీట్ దాఖలు చేయాలి.

మా తెలుగుదేశం పార్టీ నీతి,నిజాయితీ,నిబద్ధతకు ఉదాహరణ గతంలో టీటీడీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డి డీమార్ట్నేషన్ లో రెడ్ హ్యాండ్డెడ్ దొరికితే వెంటనే టీటీడీ మెంబర్ గా సస్పెండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.మళ్ళీ అదే శేఖర్ రెడ్డికి ఇప్పుడు టీటీడీ బోర్డ్ మెంబెర్ ఇచ్చి మెగా అనే శేఖర్ రెడ్డి కంపినీకి రాష్ర్టంలో ఇసుక కాంట్రాక్టు ఇవ్వడం అందరికీ తెలిసిందే.

నిన్న కాక మొన్న ప్రదీప్ జైన్ అనే వ్యక్తి ఒక బాలిక సూసైడ్ కారణమైతే ఏదో కొంతమంది పార్టీ పెద్దలతో ఫొటోస్ ఉంటే మా పార్టీ అని ముద్ర వేసినందుకు పార్టీ నుండి సస్పెండ్ చేశాము.మీ సొంత బాబాయ్ హత్య కేసులో సీబీఐ ఆరోపణలు నిందితులుగా చూపిస్తు దస్తగిరి వాగ్మూలం ప్రకారం దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ఎందుకు సస్పెండ్ చేయలేదో ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పాలి.

LEAVE A RESPONSE