టీడీపీది దుస్సంకల్ప దీక్ష.. దుస్సల సంకల్ప దీక్ష

– దుర్యోధనుడు, దుశ్శాసనుడికి మహిళలమీద ఎంత గౌరవమో.. బాబు, లోకేష్ లకూ అదే గౌరవం..!
– మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న దేశంలోనే బెస్ట్ సీఎం, మహిళా పక్షపాతి జగన్
– అమ్మ ఒడి నుంచి ఆసరా, చేయూత, 31 లక్షల ఇళ్ళ వరకు ప్రతి పథకం మహిళా సాధికారత కోసమే
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రెస్ మీట్

టీడీపీ వేధింపులను పక్కదారి పట్టించేందుకే..
రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ రక్షణ కోసం, మహిళల సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనుక్షణం పాటుపడుతున్నారు. దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి మహిళల పట్ల గౌరవం ఉందన్నది ఎంత అబద్ధమో.. రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి మహిళలపై అభిమానం ఉన్నదనేది కూడా అంతే అబద్ధం. ఈ మధ్యకాలంలో టీడీపీకి చెందిన మహిళలపై నారా లోకేష్‌ పీఏ అసభ్యంగా వ్యవహరిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బాధితులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళితే ఆ ఘటనపై ఎలాంటి చర్యలు లేకుండా ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు యత్నించారు. చంద్రబాబు మాస్టర్‌ ప్లానే.. నేటి నారీ సంకల్ప దీక్ష. ఆ దీక్ష కాస్త దుస్సంకల్ప దీక్షగా, భారతంలో దుస్సల సంకల్ప దీక్షగా మారిందని అంటున్నాం.

టీడీపీ నాయకులే మహిళలను అవమానపరుస్తూ, అగౌరవపరుస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం నిన్నటికి నిన్న విజయవాడలోనూ వెలుగు చూసింది. టీడీపీ కీచకులను వదిలేసి…. చేస్తున్నది సంకల్ప దీక్ష ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ దీక్ష చేసే అర్హత కూడా టీడీపీ వాళ్లకు లేదు.

బాబు ఒక దుర్యోధనుడు.. లోకేష్ ఒక ఉత్తర కుమారుడు
చంద్రబాబు నాయుడు ఒక దుర్యోధనుడిగా డైరెక్షన్‌ ఇస్తుంటే, ఆయన తనయుడు లోకేష్‌ ఒక ఉత్తర కుమారుడిలాగా మాస్టర్‌ ప్లాన్‌ చేశారు. గతంలో కొడుకు బాగోతాలు, స్మిమ్మింగ్‌ఫూల్‌ ఫోటోలు వాళ్లే బయట పెట్టుకున్నారు. మహిళల పట్ల వాళ్ల నీచ సంస్కృతి ఏవిధంగా ఉంటుందనేది ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే దీక్ష పేరుతో ఈ డ్రామాలు ఆడుతున్నారు. టీడీపీకి ముందు నుంచి మహిళల పట్ల మమకారం లేదు, ప్రేమ లేదు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మహిళ్ని మోసం చేయడమే ఆ పార్టీ నైజం. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర అంతా కూడా మహిళలను మోసం, దగా చేయడమే.

అధికారంలో ఉన్నప్పుడు తాను మహిళలకు ఫలానా మంచి చేశాను అనేది కూడా చెప్పుకోలేని దుస్థితి చంద్రబాబుది. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్టుగా… ఒక అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి ఏ పథకమైనా చేశారా.. ?, 31 లక్షల మందికి ఇళ్లు ఇచ్చాడా?, అని అని అడుగుతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు అన్నీ మాఫీ చేస్తానని చెప్పి ఏం చేశారు చేశారా బాబూ.?

మహిళలకు బాబు చేసిన మంచి ఒక్కటీ లేదు
మహిళలకు ఫలానా మంచి చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేకపోయినా.. ఆయన గురించి ప్రచారం చేయడానికి, ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడానికి గోబెల్స్ లా ఎల్లో మీడియా మాత్రం ఆయనకు అండగా ఉంది. బాబు పరిస్థితి ఏంటంటే.. రాష్ట్రంలో ఆయనకు పట్టుమని పది శాతం ఓట్లు

కూడా లేవనే చెప్పాలి. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన రాజకీయాలు చేయాలనుకుంటే.. మీ పార్టీనే పతనం అవుతుంది. సమాజంలో ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, గౌరవిస్తారో అక్కడే దేవతలు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు.

కానీ చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసం, దగా చేయడమే. మహిళలకు మేలు చేసేలా, చెప్పుకునే విధంగా ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన అయిదేళ్లపాటు మహిళలను మభ్యపెడుతూ చివరకు ఎన్నికల సమయంలో పసుపు-కుంకుమ పేరుతో ఓట్ల కోసం మోసం చేశాడు. చంద్రబాబు ఏది చేసినా తన స్వప్రయోజనాల కోసమే. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు అనేది పదే పదే రుజువైంది.

దేశంలోనే బెస్ట్ సీఎం జగన్
మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, స్థానిక సంస్థల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేసి, వారికి రాజకీయ పదవులు కట్టబెట్టే విషయంలోనూ జగన్‌ మోహన్‌ రెడ్డి దేశంలోనే బెస్ట్‌ సీఎంగా చెప్పుకోవచ్చు. 21వ శతాబ్దంలో రాష్ట్ర మహిళలు ఉన్నతస్థాయిలో ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం అహర్నిశలూ జగన్ పాటుపడుతున్నారు. ఎంతోమంది డ్రాప్‌ అవుట్‌ విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ఒక వరంగా మారింది. ఉన్నత చదువులు చదివి వారంతా ఉన్నతస్థాయిలో ఉండాలని సీఎం కోరుకుంటున్నారు.

ఈ మూడేళ్ల కాలంలో పేద ప్రజలకు, మహిళలకు ఎంత సంపదను ఖర్చు పెడుతున్నారనేది గ్రహించాలి. 31లక్షల మంది మహిళలకు వారి పేరు మీదే రిజిస్ట్రేషన్లు చేసి ఇళ్లపట్టాలు ఇచ్చారు. ఈబీసీ నేస్తం ద్వారా ఉన్నత వర్గాల్లోని పేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించేలా చేశారు. ఈ రాష్ట్రంలోని మహిళలు అంతా ముఖ్యమంత్రిపై ఎంతో ఆదరణతో ఉన్నారు. ఈ ఆదరణ, అభిమానాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక, కడుపుమంటతో కుట్ర, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలనేలా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రజలంతా గమనించాలని కోరుతున్నాం.

ప్రతిపక్ష స్థానాన్ని కూడా బాబు కోల్పోతాడు
ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన కుట్ర, కుతంత్రాలను మానుకుని మసలుకుంటే ప్రతిపక్ష నేతగా అయినా ఆయనకు గౌరవం ఉంటుంది. లేకుంటే అది కూడా కోల్పోతారనేది గ్రహిస్తే మంచిది అని హితవు పలుకుతున్నాం. చంద్రబాబు అరాచకాలు, దుర్మార్గాలను ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

మహిళలపై నేరాల దర్యాప్తుల్లో దేశంలోనే ఏపీ నంబర్ వన్
నాగార్జున యూనివర్సిటీలో పీజీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోతే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లైంగిక వేధింపుల కేసుల్లో 60 రోజుల్లో సెక్సువల్ నేరాల మీద పోలీసులు దర్యాప్తు చేసిన సందర్భాలు కేవలం 14. 5 శాతం మాత్రమే అయితే, అదే ఈ ప్రభుత్వ హయాంలో ఏకంగా 93.6 శాతం మేర కేసులను దర్యాప్తు పూర్తి చేశాం. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40శాతం ఉంది. మహిళల రక్షణకు, నిందితులపై సత్వరం చర్యలకు ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుందో ఊహించుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మహిళల భద్రత పట్ల తీసుకునే చర్యలను చూస్తేనే ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది.

గత టీడీపీ ప్రభుత్వంలో(2014-19 మధ్య) అత్యాచార, హత్య కేసుల్లో దర్యాప్తునకు సగటున 318 రోజులు పడితే, మా ప్రభుత్వంలో కేవలం 42రోజులకు తగ్గిందంటే.. మన ముఖ్యమంత్రి మహిళల రక్షణ, భద్రతకు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలు అంతా గమనిస్తున్నారు.

వైఎస్సార్సీపీ వరుస విజయాలను చూసి ఓర్వలేకే కుట్రలు..
టీడీపీ నాయకుల మాటలు వింటుంటే.. వాళ్ల మెదడు తలలో ఉందో, లేక మోకాలులో ఉందో అర్థం కావడం లేదు. టీడీపీ నీచ రాజకీయాలు చేస్తూ మళ్లీ దాన్ని వైయస్సార్‌ సీపీపై నెట్టడం హీనమైన చర్యగా చెప్పవచ్చు. టీడీపీ నాయకుల చేష్టలు, వారి అరాచకాలను ప్రజలు భరించబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి చెంపదెబ్బలా తీర్పు ఇచ్చారు. వైయస్సార్‌ సీపీకి బంపర్‌ మెజార్టీతో విజయం అందించడంతో దాన్ని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రంలో ఏ సమస్య లేకున్నా… ఒక సమస్యను సృష్టించి, దానిపై గోబెల్స్‌ ప్రచారం చేస్తూ పక్కదారి పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు టీడీపీని నమ్మరు.

నారీ సంకల్ప దీక్ష చేసే అర్హతే టీడీపీకి లేదు

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మేలు కలిగేలా ఏ ఒక్కటీ చేయలేదు. అలాంటి టీడీపీ ఇవాళ నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత కూడా లేదని చెబుతున్నాం.గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మహిళలకు ఫలనా మంచి చేశాను అని చెప్పగలరా? అదే మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే మహిళలకు ఎంతో చేశారు. మహిళల రక్షణ కోసం దిశా చట్టాన్ని తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రిగారు ప్రయత్నిస్తుంటే, కేంద్రం దానికి కొన్ని కొర్రీలు వేస్తోంది. అయినప్పటికీ ఆ చట్టాన్ని తీసుకువచ్చే విషయంలో ముఖ్యమంత్రిగారు సఫలీకృతం అవుతారనే నమ్మకం ఉంది. దిశ చట్టం అమలు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారితోనే సాధ్యం అవుతుంది. దిశా యాప్‌ ద్వారా ఏదైనా ఘటన జరిగితే అయిదు, పదినిమిషాల వ్యవధిలోనే పోలీసులకు అక్కడకు చేరుకుని బాధితులకు అండగా నిలుస్తున్నారు.

అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిపై అనునిత్యం గోబెల్స్‌ ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు స్వస్తి పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇలానే ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో ఆ పార్టీకి పుట్టగతులు కూడా ఉండవని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలి.

మహిళా పక్షపాతి సీఎం జగన్
మహిళా పక్షపతిగా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్‌లో మహిళలు యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి, ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే విధంగా, 21వ శతాబ్ధంలో మహిళా సాధికారత సాధించి, భారతీయ మహిళ సగర్వంగా మన రాష్ట్రం నుంచే ఆవిర్భవిస్తుందని చెబుతున్నాం. మంచి మనసున్న ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల కోసం, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మహిళాభ్యున్నతి కోసం చట్టపరంగా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎంగారికి మరింత ఆదరణ లభిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దిశా పోలీస్‌ స్టేషన్లతో పాటు, ప్రతి సచివాలయంలో మహిళా కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచుతూ.. గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే కోటి మందికి పైగా దిశ యాప్ ను మహిళలు డౌన్ లోడ్ చేసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రత గురించి ఆలోచించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దీక్షల పేరుతో హడావుడి చేస్తున్నందుకు వారే సిగ్గుపడాలి. చంద్రబాబు, ఆయన కొడుకు రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు.

టీడీపీ కీచకుడు వినోద్ జైన్ కు ఉరిశిక్ష పడాలి
టీడీపీ కీచక నాయకుడు వినోద్‌ జైన్‌ వ్యవహార శైలిని యావత్తు ఆంధ్రరాష్ట్రం తలదించుకునేలా ఉంది. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించాలి. 14 ఏళ్ల బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడి ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేయడం సిగ్గుచేటు. వినోద్‌ జైన్‌ను సంఘం నుంచి వెలివేయాలి. మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించి, ఆమె ప్రాణాన్ని హరించిన అతడికి కచ్చితంగా ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఒక మహిళగా కోరుతున్నాను.