Home » దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే బిచ్చగాడు మోదీ

దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే బిచ్చగాడు మోదీ

– కేసీఆర్‌…సిగ్గుంటే ముక్కు నేలకు రాయి
-ఆర్మూర్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్మూర్‌: రైతు బంధు 9వ తేదీ లోపు వేయకుంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ చేశా. 69 లక్షల మంది రైతుల అకౌంట్లలో వేశాం. కేసీఆర్‌ సిగ్గుంటే అమరవీరుల స్థూపం, లేకుంటే ఆర్మూర్‌ అంబేద్కర్‌ చౌరస్తా దగ్గర కు వచ్చి ముక్కు నేలకు రాయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో జరిగిన బహిరంగ సభలో రేవంత్‌ ప్రసంగించారు. గతంలో పసుపు బోర్డు తెచ్చి పసుపు రైతులను ఆదుకుంటామన్నందుకు అరవింద్‌ను గెలిపించారు. తర్వాత మోసగించాడు. మళ్లీ అదే చెబుతున్నాడు. ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే గెలిచి 150 రోజులైంది.. కేంద్రం నుంచి ఏం తెచ్చాడు? బీజేపీకి ఓట్లు వేసినా శుద్ధ దండగ అవుతాయన్నారు. పసుపు బోర్డు రావాలన్నా, చక్కెర కర్మాగారం తొందరగా తెరుచుకోవాల న్నా జీవన్‌ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని కోరారు. బీజేపీ వాళ్లు మనకు భక్తి, పూజల గురించి చెబుతారా? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. వారే అసలైన హిందువులు….దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే వారు బిచ్చగాడు అవుతాడని మండిపడ్డారు.

Leave a Reply