మోదీ రైతు పక్షపాతి

– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచడం రైతులందరికీ శుభవార్త.వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచడం రాష్ట్ర రైతాంగానికి ప్రయోజనకరం. వరికి క్వింటాల్ కు రూ.2,040 ఉన్న కనీస మద్దతు ధరను రూ.2,183కు పెంచడం రైతుకు మరింత లాభం చేకూరుతుంది.

ఈ నిర్ణయం రైతుల కష్టానికి మరింత ప్రతిఫలం చేకూరుతుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో ఎంఎస్‌పీ పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

మద్దతుధర పెంచిన మంచి సర్కారు: బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి.కె. అరుణ
కనీస మద్దతు ధర పెంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి చాటుకుంది.ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ ఇవాళ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. పంట పెట్టుబడిపై యాభై శాతం లాభం వచ్చేలా మోదీ ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడూ పెంచుతూ వస్తోంది. ఈసారి వరికి క్వింటాల్‌కు 143 రూపాయలు పెంచింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతాంగానికి విశేష ప్రయోజనం చేకూరుతోంది. రాష్ట్ర రైతాంగం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు.