జగన్ ని నమ్మి నిలువెల్లా నాశనమైపోయాం

-ఒక్క చాన్స్ ఇస్తే ఇంత విద్వంసం జరుగుతుందని ఊహించలేదు
-వైసీపీ నేతల్లోని మరో కోణాన్ని గుర్తించలేకపోయాం
-రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటాం
-జనంలోకి జనసేన కార్యక్రమంలో ప్రజల ఆవేదన
-విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం
-గుంటూరు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

ఎన్నికలకు ముందు జగన్ తోపాటు వైసీపీ నేతలు వల్లెవేసిన మాయమాటలు నమ్మి నిలువెల్లా మోసపోయామని , ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతుందని అసలు ఊహించలేదని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ముందు ప్రజలు ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం పీ వీ కే నాయుడు కూరగాయల మార్కెట్లో ప్రజలతో , వ్యాపారులతో జనసేన పార్టీ నేతలు ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా వైసీపీ అరాచక, అవినీతి , నియంత పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అధికారంలోకి రాకముందు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని , వారిలోని మరో దుర్మార్గపు కోణాన్ని అసలు ఊహించలేకపోయామని వాపోయారు. ఈ సందర్భంగా ప్రజల్ని , వ్యాపారుల్ని ఉద్దేశించి నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ నాలుగేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్రం నలబై ఏళ్ళు వెనక్కి వెల్లిందని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి బటన్ నొక్కే దగ్గర పరిపాలనను పరిమితం చేస్తే క్షేత్రస్థాయిలో వైసీపీ ద్వితీయ, తృతీయ శ్రేణులు తమ దాష్టీకాలతో ప్రజల పీక నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో ప్రజలెవరూ ఆనందంగా లేరన్నారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అంటే నీతి నిజాయితీ , నిబద్ధత ఉన్న పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు పవన్ కళ్యాణ్ కి అండగా నిలవాలని నేరేళ్ళ సురేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు, గుంటూరు నగర కమిటీ సభ్యులు, మరియు డివిజన్ అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు, తదితరులు, పాల్గొన్నారు.