సీమ కష్టాలు చూసాను… సీమ కన్నీళ్లు తుడుస్తా

– రైతాంగానికి లోకేష్ హామీలు
-మిషన్ రాయలసీమ లో ముఖ్య అంశాలు

హార్టి కల్చర్ హబ్ గా రాయలసీమ.సీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం.మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీని, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సాహం. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్.
వివిధ హర్టికల్చర్ పంటలకు రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు. దేశానికి, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు ఎక్స్ పోర్ట్ చేసే విధంగా కొత్త రకాల మొక్కలు తయారు చేసే విధంగా రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు.
టొమాటో వాల్యూ చైన్ ఏర్పాటు.
పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిచడం.
వ్యవసాయానికి వినియోగించే యంత్రాలు, పరికరాలు ఏపిలో తయారు చేసి తక్కువ ధరకే సబ్సిడీలో రైతులకి అందించడం.
సీడ్ హబ్ గా ఏపి ని మార్చడం.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందేలా ప్రత్యేక కార్యాచరణ.
పాత భీమా పథకాన్ని అమలు చెయ్యడం.
రైతు బజార్లు పెంపు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం లక్ష్యం.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పంటలు వెయ్యాలి అనే దానిపై ప్రభుత్వం నుండే సలహాలు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు.
కొనుగోలు కేంద్రాలు, మిర్చి, పసుపు పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు.
కౌలు రైతులను గుర్తించి భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సాయం అందించడం.
సీమ కష్టాలు చూసాను… సీమ కన్నీళ్లు తుడుస్తాను.
పాడి రైతులకు ఊతం.
పాడి రైతుల్ని ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక.
పశువుల కొనుగోలు దగ్గర నుండి మేత, మందులు వరకూ అన్ని సబ్సిడీలో అందజేత.
గోకులం లు ఏర్పాటు.
గొర్రెలు, మేకల పెంపకం కోసం ప్రత్యేక సాయం, ఉచితంగా గొర్రెలు, మేకల పంపిణీ.
మేత కోసం బంజరు భూములు కేటాయింపు.
ఫార్మ్స్ ఏర్పాటు కు సబ్సిడీ రుణాలు.