రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో సంబురాలు చేసుకోలేదట
తెలంగాణలో కూడా సంబురాలు చేసుకోలేదట. ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు
తెలంగాణ ఊరు, వాడా సంబురం చేసుకున్నది
రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1 గా ఉంది
200 పించన్ 2000 వేలు చేసుకున్నాం.ఎకరానికి 10 వేల రైతు బంధు అందిస్తున్నం
తెలంగాణ ఏర్పడితే తెలంగాణలోని ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు, పండగ చేసుకున్నారు. కానీ మోడీ మాత్రం పండగ చేసుకోలేదని కడుపులో విషం కక్కుతున్నడు
వేరుపడ్డ తొలి రోజుల్లోనే 7 మండలాలు ఏపీలో కలిపి తెలంగాణకు అన్యాయం చేశారు
లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రాకు అప్పజెప్పి మోడీ తెలంగాణకు మోసం చేశారు
జాతీయ ప్రాజెక్టు, గిరిజన యూనివర్సటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా.. అన్ని అబద్ధాలే
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తం అన్నారు. 2 లక్షలు కూడా ఇవ్వలేదు
అలాంటి వాళ్ళు తెలంగాణపై విషం చిమ్మడం మానాలి
రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో సంబరం చేసుకోలేదు అనడం తీవ్రంగా ఖండిస్తున్నా
మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లో డబుల్ లేనింగ్ రోడ్, గజేంద్ర భారతి మహారాజ్ సహా ఇతర అభివృద్ధి పనులకు భూమిపూజతో పాటు గ్రంథాలయం ప్రారంబించిన మంత్రి హరీశ్ రావు. అనంతరం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా లోక్‌సభలో ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
హరీష్‌రావు ఏమన్నారంటే..
నారాయణ్ ఖేడ్ అంటే ఒకప్పుడు కొట్లాటలు, గంజాయి సాగు, అభివృద్దికి ఆమడ దూరం.ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల ఘనత అది.తల్లిదండ్రులు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తే పిల్లల చదువు ఆగేది. అభివృద్ధికి అడ్డాగా నేడు నారాయణ్ ఖేడ్ మారింది.చెరువులు, చెక్ డ్యాంలు, మార్కెట్ యార్డులు, పచ్చని పంటలుమక్కలు, శనిగలు నాడు కొనని పరిస్థితి. నేడు అన్ని పంటలు కొంటున్నం. అందుకే కర్ణాటక నుండి వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు.
ఇక్కడ ఉన్నది బి ఆర్ ఎస్ అక్కడ ఉన్నది కాంగ్రెస్. నీళ్ళ కోసం అనేక కష్టాలు. నేడు అలాంటి పరిస్థితి లేదు. నల్లాలు పెట్టి ఇంటింటికీ నీళ్ళు ఇచ్చింది కెసిఆర్. కాంగ్రెస్ వాళ్లు గ్యారెంటీ లంటు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో పింఛన్లు 600, వికలాంగులకు ఇచ్చేది 1000. మరి తెలంగాణలో బియారెస్ ప్రభుత్వం ఇచ్చేది ఎంతనో ప్రజలు ఆలోచించాలి.
కర్ణాటకలో 10 కిలోల బియ్యం ఇస్తా అన్నారు, మాట తప్పారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఉన్న బస్సు బంద్ పెట్టారు. ఉచిత కరెంట్ అన్నారు, కరెంట్ బిల్లు డబుల్ చేశారు. దమ్ముంటే మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీరు చెప్పేవి అమలు చేయండి. కర్ణాటకలో దవాఖానలు బాగోలేవని అక్కడి ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తె, 6 నెలలకు ఒకసారి సీఎం మారుతారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పోతారు. వాళ్ళ హైకమాండ్ ఢిల్లీ కాబట్టి. మా హైకమాండ్ గల్లీలో ఉండే ప్రజలే.