ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వేగంగా, అత్యంత రహస్యంగా జరిగిన ఒక ఆపరేషన్ ఏదైనా ఉందంటే, అది మాజీ ముఖ్యమంత్రి గారి జగన్ ‘తుఫాన్ పలాయనం’!
తుఫాన్ VS జగన్: స్పీడ్ టెస్ట్!
తాజాగా రాష్ట్రంలో వచ్చిన మొంథా తుఫాన్ కంటే, మాజీ ముఖ్యమంత్రి గారు ప్రదర్శించిన వేగమే హాస్యాస్పదంగా మారింది.
తుఫాన్ లెక్క: “రాష్ట్రంలో మొంథా తుఫాన్ ఉన్నది – 4 రోజులు”
నాయకుడి లెక్క: “జగన్ ఉన్నది – 2 రోజులు” (అందులోనూ కాలు బయట పెట్టకుండా!)
రాష్ట్రాన్ని దాటుకుని తుఫాన్ వేగంగా వెళ్ళిందా, జగన్ వేగంగా వెళ్ళాడా? అని ఇప్పుడు ప్రజలు గూగుల్‌లో వెతకాల్సిన పరిస్థితి! మొంథా తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయని తెలియగానే, తాడేపల్లి ప్యాలెస్ నుండి ఆయన ఫ్లైట్ బుక్ చేసే వేగం ముందు, వాతావరణ శాఖ కూడా దిగదుడుపే!
బెంగళూరు నుండి బ్రీఫ్ విజిట్!
తుఫాన్ మొత్తం వెళ్ళిపోయాక… మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన ‘బ్రీఫ్ విజిట్’ ఇది:
రాక (సాయంత్రం): “మొన్న సాయంత్రం తుఫాను మొత్తం వెళ్ళిపోయాక బెంగళూరు నుంచి దిగాడు…” – అంటే, రిస్క్ ఏమీ లేదని జీరో రిస్క్ గ్యారెంటీ వచ్చాకే ఆయన తాడేపల్లిలో ల్యాండ్ అయ్యారు.
విమర్శ (తరువాతి రోజు): “నిన్న తుఫాను వచ్చింది, చంద్రబాబు వల్లే అన్నాడు…” – తుఫాన్ నష్టాన్ని కూడా ప్రత్యర్థులపై నెట్టేసి, తన బాధ్యతను శుభ్రంగా కడుక్కున్నారు!
పలాయనం (ఈ రోజు): “ఈ రోజు తుఫాన్ తీరం దాటిన వేగం కంటే వేగంగా బెంగళూరు వెళ్ళిపోయాడు…” – విమర్శలు పూర్తి చేసి, బెంగళూరులో చేసిన బిసిబిలేబాత్ చల్లబడకముందే వెళ్ళిపోవాలనే ఆత్రుత!
ఆయన దృష్టిలో ఆంధ్రా అంటే… ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత వచ్చి, చంద్రబాబుపై రెండు విమర్శలు చేసి, వెంటనే వెనక్కి వెళ్ళిపోయే ఒక ‘టూరిస్ట్ స్పాట్’ లాంటిది! తుఫాన్ ఉంటే ఆయన ప్యాలెస్ ఏసీ గదుల్లో ఉండాలి, తుఫాన్ పోతే ఆయన ఫ్లైట్ టేకాఫ్ అయి ఉండాలి – ఇది ఆయన కొత్త రాజకీయ సూత్రం!
కామెడీ పీస్‌కు కోట్ల ఖర్చు!
ఈ మొత్తం డ్రామా వెనుక ఉన్న అసలు ఖర్చు ఇది:
ఈ కామెడీ పీస్ కోసం, కొన్ని వందల కోట్లు సోషల్ మీడియాలో తగలేసి ఎలివేషన్ రీల్స్ చేపిస్తూ, సజ్జల కోట్లు దండుకుంటున్నాడో లేదో గానీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవలేక జగన్ చేసిన కామెడీతో.. సోషల్మీడియాలలో రీచ్, వ్యూస్ సునామీ సృష్టించింది.
-చాకిరేవు