Suryaa.co.in

Andhra Pradesh

తప్పించుకొనే తాటికాయ నాటకాలతో మరింత అసహ్యం

(బోయపాటి రమేష్)

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అనేది సామెత. మానవత్వం లేకుండా చెట్టంత మనిషి సింగయ్య తన కాన్వాయ్ కారు క్రింద పడి చావు బ్రతుకుల మధ్య వుంటే.. అయ్యోమనే కనీస సగటు మనిషిగా కూడా వ్యవహరించక ఈడ్చి పొదల్లో పడేయించి బెట్టింగ్ ఆడి ఓడి ఆత్మహత్య చేసుకున్న వాడి విగ్రహం కార్యక్రమంలో కొనసాగించాడు జగన్.

ఒక్కరిది కాదు అక్కడే మరో రెడ్డి యువకుడి ప్రాణం పోయినా.. గడ్డిపరకల్లా భావించిన దుర్మారర్గుడు అని జనం ఉమ్మేస్తుంటే.. ఎప్పుడు తాడేపల్లిలో వుంటాడో జగనుకే తెలియని ఆ కొంప ముందు తాటికాయ పడిందట. భద్రత విషయంలో ప్రభుత్వం అజాగ్రత్తగా వ్యవహరించింది అని డ్రామా స్క్రోలింగ్ మొదలెట్టారు సాక్షిలో.

తలకాయ కారు టైర్ క్రింద వున్నా ఆపని దుర్మార్గుడు తాటికాయతో పోతాడు అని ఎవరన్నా అనుకొంటారా?

పనిగట్టుకుని కారులో వచ్చి ఇంటి ముందు విసిరేసి వెళతారా?

దానికి ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతారా?

ఇలాంటి బిలిబిత్తిరి నాటకాలలో ప్రాణాలు తీసిన పాపం పోదు. జనం ఈ డ్రామాలను మరింత అసహ్యించుకొంటున్నారు.

LEAVE A RESPONSE