Suryaa.co.in

Andhra Pradesh

అమ్మ ఒడి.. అసలు సృష్టికర్త ఎవరు?

“అమ్మ ఒడి” పథకం జగన్ మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అని కొందరు అంటుంటారు. కానీ వాస్తవానికి, ఈ పథకానికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన “పసుపు-కుంకుమ” పథకం. పేరు మార్చి, కొన్ని మార్పులు చేసి “అమ్మ ఒడి”గా అమలు చేశారు.

విషయాలను నిశితంగా పరిశీలిస్తే:

* పసుపు-కుంకుమ: చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో రాష్ట్రంలోని కోటి మందికి పైగా డ్వాక్రా మహిళల కోసం “పసుపు-కుంకుమ” పథకాన్ని రెండుసార్లు అమలు చేశారు. దీని ద్వారా ప్రతి మహిళకు సుమారు రూ. 10,000 చొప్పున, మొత్తంగా దాదాపు రూ. 20,000 కోట్లను అందించారు. ఇది రాష్ట్ర సంపదను సృష్టించి, మహిళలకు నేరుగా ఆర్థిక సహాయం అందించిన పథకం.

* అమ్మ ఒడి: జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక “పసుపు-కుంకుమ” పథకాన్ని నిలిపివేశారు. దాని స్థానంలో “అమ్మ ఒడి” అనే కొత్త పేరుతో పథకాన్ని ప్రారంభించారు. అయితే, ఈ పథకం కింద కేవలం 40 లక్షల మంది తల్లులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. మూడు విడతల్లో, ఒక్కో విడతకు రూ. 5,500 కోట్ల చొప్పున, మొత్తంగా రూ. 16,500 కోట్లను అప్పులు చేసి పంపిణీ చేశారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గడమే కాకుండా, పథకం కోసం అప్పు చేయాల్సి రావడం గమనార్హం.

ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్ ప్రణాళికలు:

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావడంతో, సుమారు 67 లక్షల మంది పిల్లలకు తల్లులకు “తల్లికి వందనం” పథకం ద్వారా లబ్ధి చేకూర్చచారు.

ఈ వాస్తవాలను బేరీజు వేసుకుంటే, జగన్ మోహన్ రెడ్డి గారు కొత్తగా చేసిందేమీ లేదని, కేవలం పాత పథకాలకు పేర్లు మార్చి, అప్పులతో వాటిని అమలు చేశారనే వాస్తవం.

– బి.డి.కృష్ణ

LEAVE A RESPONSE