Suryaa.co.in

Andhra Pradesh

రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ

* ఎన్నికల సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పాం..ప్రజలు విశ్వసించి ఎన్డీయే కూటమిని గెలిపించారు.. అందుకు ధన్యవాదాలు

* ప్రధాని మోదీ చిరకాల స్వప్నమైన వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగమని అందరూ గుర్తించాలి

* కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి అమరావతి రాజధాని నిర్మాణం మొదలుకొని పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్, ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇలా అన్నింటికి ప్రోత్సాహం ఇస్తూ అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది

* వికసిత్ ఆంధ్రరాష్ట్రం కావాలంటే వికసిత్ జిల్లాలు కావాలి..అంటే వికసిత్ రాజమహేంద్రవరం వికసిత్ ఆంధ్రప్రదేశ్ లో భాగమని గుర్తించాలి

* వికసిత్ రాజమహేంద్రవరంలో భాగంగానే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనతో పాటు పలు ప్రాజెక్టులు ప్రారంభించడం జరుగుతోంది

* 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి నిరుపయోగంగా ఉన్న హేవలాక్ వంతెన ప్రాధాన్యతను కేంద్రం గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది

* గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా విగ్రహాలు తొలగించకుండా అభివృద్ధిని చేయాలని పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ కు సూచించాం

* 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నేడు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కర్ ఘాట్ ను అభివృద్ధి చేయనున్నాం

* రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరాన్ని చారిత్రక, సాంస్కృతిక రాజధానిగా గుర్తించాలని అభ్యర్థించారు..ఇప్పటికే ఈ అంశాన్ని నేను పార్లమెంట్ లో లేవనెత్తాను..రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించేందుకు నా వంతు కృషి చేస్తాను.

* రాజమహేంద్రవరాన్ని పర్యాటకంగా, అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం..ఆ దిశగా అడుగులు వేస్తున్నాం

* గౌతమీ లైబ్రరీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నాను

* ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంటూ రాజమహేంద్రవరం అభివృద్ధికి కచ్చితంగా నా వంతు సహకారాన్ని అందిస్తాను

* శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన అతిథులతో పాటు ప్రజానీకానికి ధన్యవాదాలు

LEAVE A RESPONSE