Suryaa.co.in

Telangana

రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తో ఎంపీ రవిచంద్ర భేటీ

ఢిల్లీ: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఖమ్మం జిల్లాలో నెలకొన్న సమస్యలపై రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్ తో సమావేశమై చర్చించారు. ఎంపీ రవిచంద్ర ఢిల్లీలోని రైల్ నిలయంలో సోమవారం ఆయనను కలిసి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నెలకొన్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ వినతిపత్రం అందజేశారు. పలు రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, కొత్తగా ప్లాట్ ఫారంల ఏర్పాటు,పాత వాటి విస్తరణ, కోవిడ్ కు ముందు రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించడం,అదనపు హాల్టింగ్ లు,మరిన్ని రైలు సర్వీసులను ప్రారంభించడం తదితర అంశాలపై ఎంపీ రవిచంద్ర బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్ తో చర్చించారు.ఎంపీ వద్దిరాజు ప్రస్తావించిన అంశాల పట్ల చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీనిచ్చారు.

LEAVE A RESPONSE