– బాబును ప్రశ్నించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు
– కృష్ణానదిలో రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు నీళ్లు దోచుకుంటుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు
– ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు
– పాలన చేతకాక ప్రకృతిపైన, ప్రతిపక్షాలపైన, నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు
– రేవంత్ రెడ్డిది 20-20 మ్యాచ్ అని అన్నాడు మొన్న
– ఫైనాన్స్ లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్
– రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్
– మున్సిపల్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ లకు, గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ ఇవ్వాలంటే 20% కమిషన్
– కాంగ్రెస్ వైఫల్యం వల్లనే వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి
– వెంటనే దేవాదుల ఫేజ్ 3 మోటార్లను ప్రారంభించి పంట పొలాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తున్నాం
– జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం
జనగామ: కృష్ణానదిలో రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు నీళ్లు దోచుకుంటుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మౌనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ప్రజాభవన్ కి చంద్రబాబు నాయుడును పిలిచి అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి. బాబును ప్రశ్నించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. ఉత్తంకుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా చంద్రబాబు దగ్గరికి వెళ్లి భోజనం చేసి వచ్చాడు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. ఈ కారణంగా ఈరోజు నల్గొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి.
మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎండల వల్ల పంటలు ఎండిపోతుంటే కెసిఆర్ , హరీష్ రావు సంతోషపడుతున్నారని అన్నాడు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కెసిఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎండలు కొట్టాయి. కానీ ఆనాడు ఎందుకు పంటలు ఎండలేదు, ఈరోజు ఎందుకు ఎండిపోతున్నాయి? మండుటెండల్లో కూడా వాగులు, వంకలు, చెరువుల్లో నీళ్లు ఉండేవి. ఒక ఎకరం కూడా ఎండకుండా కెసీఆర్ పాలనలో పంట పండింది. పాలన చేతకాక ప్రకృతిపైన, ప్రతిపక్షాలపైన నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు.
ఇది కాలం తెచ్చిన కరువు కాద రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. దేవాదుల ఓ అండ్ ఎం కాంట్రాక్టర్ కు 7000 కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల 33 రోజులు పంపుల మోటర్లు ఆన్ చేయలేదు. 33 రోజులు దేవాదుల పంపుల మోటార్లు ఆన్ చేసి ఉంటే రిజర్వాయర్లు నిండేవి, పొలాలకు నీళ్లు వచ్చేవి. రేవంత్ రెడ్డి చేసిన తప్పును ప్రకృతి మీద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు ఇవ్వద్దని మోటార్లకు అడ్డంగా హరీష్ రావు, బిఆర్ఎస్ నాయకులు నిలుచున్నారా?
రేవంత్ రెడ్డిది 20- 20 మ్యాచ్ అని అన్నాడు మొన్న. ఫైనాన్స్ లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్. మున్సిపల్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ లకు, గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ ఇవ్వాలంటే 20% కమిషన్. కాంగ్రెస్ వైఫల్యం వల్లనే వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. ఈసారి ప్రకృతి కనికరించింది. పోయినసారి కంటే ఈసారి వర్షాలు సమృద్ధిగా పడ్డాయి.
వేలాది టీఎంసీల నీళ్లు గోదావరిలో కలిశాయి. కెసిఆర్ ఉన్నప్పుడు చుక్క చుక్కను ఓడిసిపెట్టాడు.రేవంత్ రెడ్డి ఏమో నీళ్ళను వృథాగా వదిలిపెడుతుండు. గోదావరిలో ప్రవాహం ప్రారంభం అయిందని తెలివంగానే మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లు చెరువులు కుంటలు నింపి ఉండాల్సింది. సకాలంలో ఓ అండ్ ఎం పనులు పూర్తిచేసుకుని ఎండాకాలం కోసం నీళ్లు సిద్ధం చేసుకోవాల్సింది.
తెలంగాణకు పట్టిన గ్రహణం రేవంత్ రెడ్డి. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వంతో పోరాటం చేసి ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ సెక్రటరీ చుట్టూ తిరిగి వెంటపడి 30 రోజులకి ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయించుకొని మోటర్లు రిపేర్ చేపించారు. 33 రోజులు మోటర్లు బాగు చేసి భీమ్గన్పూర్ నింపుకొని, చలి వాగు నింపుకొని, ధర్మసాగర్ నింపుకొని, గడ్డి రామారం నింపుకొని, బొమ్మకూరు నింపుకొని, తపాస్పల్లి దాకా నీళ్లు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మోటార్ ఆన్ చేసిన నీళ్లు అందని పరిస్థితి ఉంది. ఒక వరంగల్ జిల్లాలోని లక్ష ఎకరాలు ఎండిపోతున్నాయి అంటే ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ రెడ్డి చేతకానితనం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం.
ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కూడా పంటలు ఎండిపోతున్నాయి. ఈరోజు నల్గొండ, మహబూబ్ నగర్ లో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా కృష్ణ నది జలాలను దోచుకోవడమే కారణం. దేవాదుల మంచిగా కట్టినిల్లు పెట్టిన పోయి.కెసిఆర్ సమ్మక్క సాగర్ కట్టారు. మూడు నుండి నాలుగు టీఎంసీల నీళ్లు ఈరోజుకి సమ్మక్క సాగర్ లో ఉన్నాయి.
ప్రభుత్వం బిల్లులు లేకపోవడం వల్ల, మోటార్లు సకాలంలో ఆన్ చేయకపోవడం వల్ల నీళ్లు రావడం లేదు. దేవాదుల ఫేజ్ 3 కూడా పూర్తయింది. ఫేజ్ 3 మోటార్ ఆన్ చేస్తే కూడా ఇంకెక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. 60 , 70 శాతం పంటలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ జిల్లా కాంగ్రెస్ మంత్రులు, నాయకులు పట్టించుకోరా రివ్యూ చేయరా? లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతుంటే కాంగ్రెస్ నాయకులకు చీమ కుట్టినట్టయినా లేదా?
వెంటనే దేవాదుల ఫేజ్ 3 మోటార్లను ప్రారంభించి పంట పొలాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వానకాలం రైతుబంధు ఎగ్గొట్టినవ్, యసంగి రైతుబంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, ఎరువుల తిప్పలు పోలేదు, మోటార్లు కాలిపోతున్నాయి. ఇంకా 400 కోట్ల రూపాయల సన్న వడ్ల బోనస్ పెండింగ్ ఉన్నాయి. యాసంగి పంట కోతకొచ్చినా ఇప్పటికీ వానకాలం పంట బోనస్ డబ్బులు ఇంకా రైతులకు పడలేదు.