Suryaa.co.in

Telangana

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఎంపీ వద్దిరాజు భేటీ

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు.తమ తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు పామాయిల్ (ఆయిల్ ఫాం) తోటల సాగుకు అనువైన, సారవంతమైనవని ఎంపీ రవిచంద్ర కేంద్ర మంత్రికి వివరించారు.ఈ జిల్లాలలో పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎంపీ రవిచంద్ర మంత్రి చౌహాన్ దృష్టికి తెచ్చారు.

నాసిరకమైన విత్తనాలు,నర్సరీలలో నెలకొన్న అవినీతి, వ్యవసాయ, ఉద్యానవన అధికారుల నుంచి సరైన మార్గనిర్దేశం లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి శివరాజ్ కు వివరించారు.రైతులు తాము పెట్టుబడి కూడా తిరిగి పొందలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలిచ్చి నాణ్యమైన విత్తనాలు, ప్రోత్సాహాకాలు అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుని ఆయిల్ ఫాం రైతులను ఆదుకోవలసిందిగా ఎంపీ వద్దిరాజు మంత్రి చౌహాన్ కు వినతిపత్రం సమర్పించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తన శాఖ ఉన్నతాధికారులకు తగు ఆదేశాలిచ్చారు.

LEAVE A RESPONSE