-
జగనన్న ఫొటో స్థానంలో పవన్
-
మిగిలినదంతా సేమ్ టు సేమ్
-
మల్లన్న కట్ అండ్ పేస్ట్ తెలివితేటలు
-
జగనన్న జమానాలో చక్రం తిప్పిన మల్లికార్జున
-
జగన్, రోజాకు భజన కార్యక్రమాలు
-
గతంలో సంచలనం సృష్టించిన గన్నవరంలో మహిళ వద్ద బంగారం పట్టివేత కేసు
-
సీఎంఓ రెడ్డిగారి దయతో బయటపడిన కుటుంబం
-
రిటైరయినా మళ్లీ కల్చరల్ శాఖలో ఉద్యోగం
-
ఎమ్మెల్యే మండలి సిఫార్సుతో మల్లికి ఉద్యోగం?
-
జగన్ భక్తుడిపై బుద్దుడి ప్రేమ?
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘నాకొక బుల్లి చెల్లి. నేడే గల్లీలో దానికి పెళ్లి. ఇలా నా చెల్లికి పెళ్లి, జరగాలి మళ్లీ మళ్లీ’’.. ‘యమలీల’లో తనికెళ్ల భరణి పాపులర్ డైలాగు ఇది. దీనిని భాషా సాంస్కృతిక శాఖ డైరక్టర్ మల్లికార్జున బాగా ఫాలో అవుతున్నట్లున్నారు. ఇంతకూ‘ ఆర్ట్ ఆఫ్ లివింగ్’లో పండిట్ రవిశంకర్‌జీనే చంపిపుట్టిన ఈ మల్లికార్జున ఎవరో తెలుసా?.. అదేనండి.. జగనన్న జమానాలో గన్నవరం ఎయిర్‌పోర్టులో ‘బంగారంతో పట్టుబడిన మహిళ ’అంటూ టీవీల్లో స్క్రోలింగులొచ్చాయి గుర్తుందా? సరే అప్పటి సీఎంఓలో చక్రం తిప్పిన ఓ పులివెందుల రెడ్డి సారు, విజయవంతంగా కేసు నుంచి తప్పించారనుకోండి. దానిని ఫార్వార్డ్ చేసినందుకే ఓ వృద్ధ జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆమె ఈ సారు వైఫేనట.
భజన చేయడంలో అవార్డులు పెడితే అందుకు మల్లికార్జున సారుకు ఆస్కార్, ఫిలింఫేర్, నంది ఇలాంటివేమీ సరిపోవు. కొత్తగా మరో పేరు పెట్టాల్సిందే. గత సర్కారులో జగనన్న, రోజక్కను ఆకాశానికెత్తిన మల్లికార్జున సార్.. లేటెస్టుగా చేసిన విన్యాసం, పాపం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను నగుబాటుకు గురిచేసింది.
తాజాగా మల్లికార్జున సారు పవన్ కల్యాణ్‌ను కలిశారు. అమరావతి చిత్రకళ వీధి పోస్టర్‌ను పవన్‌తో ఆవిష్కరింపచేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ పవన్‌కు బహుకరించిన ఫొటో చూస్తే.. అబ్బా పెద్దలను బురిడీ కొట్టించడానికి ఇలాంటి ‘కాపీ పేస్టు విన్యాసాలు’ కూడా చేయవచ్చా అని అనిపించక మానదు. ఇంతకూ విషయమేమిటంటే.. సరిగ్గా అలాంటి ఫొటోను మల్లికార్జున సార్ జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల సందర్భంగా వాడారు. చుట్టూ కళాకారులు-మధ్యలో జగనన్న మెడలో కండువా వేసుకుని దణ్ణం పెట్టే ఫొటొ ఒకటి బహుకరించారు. ఇప్పుడు పవన్‌కు బహుకరించిన ఫొటోలో.. ఒక్క జగన్ ఫొటో తప్ప మిగిలినదంతా అవే ఉంచిన మల్లన్న ‘అతి’ తెలివికి మూర్ఛపోవలసిందే.
ఇంతకూ అసలు ఎప్పుడో రిటైరయిపోయిన మల్లికార్జున మళ్లీ కూటమి సర్కారులో ఎలా ప్రత్యక్షమయ్యారు? జగనన్న పేరు మార్మోగించిన మల్లికార్జున సారును సర్కారు ఎలా తీసుకుంది? అసలు చాలామంది ఐఏఎస్‌లకే పోస్టింగులు లేక చకోరపక్షుల్లా ఎదురుచూస్తుంటే, ఈ మల్లన్నకు మళ్లీ పోస్టు ఇలా వచ్చిందనే కదా మీ డౌటనుమానం? ఏముంది.. సింపుల్. కళాభిమాని మండలి బుద్దప్రసాద్ లాంటి అమాయకులుంటే.. ఇలాంటి మల్లన్నకు రిటైరయినా పోస్టింగులకు కొదువేముంటుంది? ఏదేమైనా పవన్ పరువు తీసిన మల్లన్న ఆవిధంగా ముందుకెళ్లారన్నమాట!
అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే ఆ కార్యక్రమంలో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఒక చిత్రాన్ని డిప్యూటీ సీఎం కి ఇచ్చారు. ఆ చిత్రం కళాకారుల మధ్యలో ఉప ముఖ్యమంత్రి ఉన్నట్లు చాలా వినూత్నంగా చిత్రించారు. అయితే ఆ చిత్రం గతంలో రోజా మంత్రిగా ఉన్న సమయంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పేరిట ప్రజా ధనంతో జగన్ రెడ్డికి భజన చేశారు. ఆ సందర్భంగా జగన్ రెడ్డికి ఒక పెయింటింగ్ ని రేగుళ్ల మల్లిఖార్జున ఇచ్చారు. ఇప్పుడు మల్లి అదే దానికి పవన్ కళ్యాణ్ పెయింటింగ్ జోడించి, పవన్ మన్ననలు పొందాడు. కానీ పవన్ కి అసలు నిజం తెలిస్తే.. మల్లిఖార్జున ఏమవుతారో ఏమో చూడాలి.
మాకంటే భజన ఎవరూ చేయలేరు
ప్రతీ ప్రభుత్వానికి భజన చేయడంలో ఆరితేరిన వ్యక్తి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జున రావు. ఆయనకు భజనంటే వృత్తి. ఏ కార్యక్రమం జరిగినా తన మార్క్ బొమ్మ గీయించడంలో అతను అధిగమించలేనివారు. బిజీ షెడ్యూల్‌లోనూ తన ఇంటి వద్ద జగన్ పుస్తకాలతో, చిత్రపటాలతో భజన చరిత్రను రాసేవారన్న ప్రచారం లేకపోలేదు.
జగన్ భజనలో మల్లికార్జున ప్రత్యేకత
– భజన చరిత్రకారుడు: జగన్ పుస్తకాలతో కల్పించిన ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ భజనలో కొత్త కోణాలను తెచ్చారు.
– “మంచి కళాకారుడివి” – జగన్ ప్రశంసలు:
షిక్కటి నవ్వుతో “నువ్వు గొప్ప కళాకారుడివి మల్లికార్జున!” అంటూ జగన్ పట్ల ఆయనకు ప్రశంసలు అందించేవారు.
ప్రతీ మంత్రి కోసం భజన
జగన్ మాత్రమే కాదు, మంత్రి పదవిలో ఎవరు ఉన్నా వారికి మల్లికార్జున భజన చేస్తూ అధికారికి తగిన గౌరవం ఇవ్వకుండా సగం కాలం భజనకే కేటాయించేవారన్న విమర్శలు లేకపోలేదు.
అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రజల కష్టం పక్కన పెట్టి, పాలకుల ఫోటోలు గీయడం, పుస్తకాలు ప్రచురించడం, అనవసర భజన కార్యక్రమాలతో తన విశేషత చాటుకోవడం మల్లికార్జున ప్రత్యేకత. ఈ క్రమంలో ప్రజల నిధులు వృథా అయ్యాయని కళాకారులూ, అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.