– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్.
అమరావతి: క్రైస్తవ మత ప్రచారకుడు పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మరణంపై సిబిసిఐడి చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, కొంతమూరు పెట్రోల్ బంక్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించడం మరణించడం బాధాకరం.
ఆయన మరణంపట్ల ప్రజల్లో, క్రైస్తవ సంఘాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రైస్తవ మత ప్రచారకుడనే కారణంగా పాస్టర్ ప్రవీణ్ హత్య గావించబడినట్లు క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. లౌకిక భారతావనిలో మతపరమైన హత్యలు, దూషణలు సరైనవి కావు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై సీబీసీఐడీ చేత సమగ్ర దర్యాప్తు జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.