హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలతో పాటు మైనారిటీలు కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, మంత్రిమండలిలో స్థానం కల్పించకుండా అవమానిస్తుండడం విచారకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో మహమూద్ అలీకి ముఖ్యమైన హోం మంత్రిత్వ శాఖనిచ్చి ఉప ముఖ్యమంత్రిని చేశారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా ఎంపీ రవిచంద్ర కాలునొప్పితో బాధపడుతూ కూడా కృష్ణానగర్ లో పలువురు ముస్లిం ప్రముఖులను కలిసి ప్రచారం నిర్వహించారు.
ఎంపీ రవిచంద్ర శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లిం నాయకులతో మాట్లాడుతూ,కేసీఆర్ గొప్ప లౌకిక వాది అని,అన్ని మత విశ్వాసాలను గౌరవించారని, శాంతిభద్రతలు విల్లసిల్లాయని వివరించారు.మైనారిటీలను ఉన్నత విద్యావంతులను చేసేందుకు గాను 250కి పైగా ప్రత్యేక గురుకులాలను ప్రారంభించి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందించారని ఎంపీ రవిచంద్ర తెలిపారు.