Suryaa.co.in

Andhra Pradesh

కుప్పం పర్యటనలో ప్రజలకు ఏం చెప్పాలనుకుటుంన్నారు ?

చంద్రబాబును ప్రశ్నించిన ఎంపి విజయసాయిరెడ్డి

మాజీ ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు మూడు రోజులుగా సొంత అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తూ ప్రజలకు ఎం చెప్పాలనుకుంటున్నారని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబు అనవసర ఉద్రిక్తతలకు కారణమౌతూ పాలకపక్షాన్ని, పాలనాయంత్రాంగాన్ని తిట్టిపోయడానికే ఈ పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుప్పం ఒకటని అన్నారు. ఆయన మూడు రోజలుగా అక్కడే పర్యటిస్తూ అలజడి, అల్లకల్లోలం సృష్టించడం ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమని వెల్లడించారు. నాయకులు ప్రాతినిధ్యం వహించే స్థానాలు ఉంటాయిగాని ‘శాశ్వత సొంత నియోజకవర్గాలు’ అంటూ ఉండవని చెప్పారు. రాయ్‌ బరేలీ అయినా, అమేఠీ అయినా ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు. రెండు పార్టీలు అధికారం కోసం పోటీపడే పరిస్థితుల్లో ఏ స్థానంలోనైనా రాజకీయ ఉద్రిక్తతలు సహజమేనన్నారు.

చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన నేత– వేడెక్కిన పరిస్థితులను చాకచక్యంగా చల్లబరచాలని హితపు పలికారు. ప్రజలందరితో ‘నేను మీవాణ్ని’ అని చెప్పాలేగాని ‘మేం అధికారంలోకి వస్తే అధికారుల పని పడతాం అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇప్పటి పాలకపక్ష కార్యకర్తల భరతం పడతాం,’ అంటూ రాజకీయ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెంచకూడదని హితబోద చేశారు. ఇందుకు విరుద్ధంగా మాజీ సీఎం గత మూడు రోజులుగా కుప్పంలో వేస్తున్న వీరంగం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించడేమేనని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేశారు.

కుప్పం బాబుకు ఎప్పుడు ‘సొంతం’ అయింది?
చిత్తూరు జల్లాలోని తన సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజవర్గం నుంచి చంద్రబాబు 1978లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి గెలిచారని తెలిపారు. 1983లో హస్తం గుర్తుపైనే రెండోసారి నిలబడి మామ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామ నాయుడు చేతిలో 17 వేల 500 ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం కాని, తర్వాత ఆయన చంద్రగిరి జోలికి పోలేదన్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు 1989 నుంచి 2019 వరకూ కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకకు ఆనుకుని ఉండే ఈ నియోజవకర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎన్నికయ్యారని తెలిపారు. ఈ కారణంగా కుప్పం తన ఇలాకా అనో, ఎదురులేని సామ్రాజ్యమనో అనుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమాత్రం సబబు కాదని హితపు పలికారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కూడా అయిన చంద్రబాబు అక్కడ రోజుల తరబడి తిష్ఠవేసి గలాటా చేయడం రాజకీయ సంస్కారం అనిపించుకోదని తెలిపారు.

LEAVE A RESPONSE