మిసెస్ ప్లానెట్ శివ నాగ‌మల్లిక బిల్లుపాటి

0
68

విజయవాడ ఆటోనగర్ ప్రాంతానికి చెందిన దుర్గ శివ నాగ‌మల్లిక బిల్లుపాటి అంతర్జాతీయ అందాల పోటీలో పాల్గొని వివాహితల విభాగంలో 60 మంది ఇతర దేశాల వివాహితలతో ఏడు రౌండ్ లలో తలపడి మిసెస్ ప్లానెట్ టైటిల్ ను సాధించి ప్రపంచ అందాల పోటీలలో తెలుగువారి ఖ్యాతి మరోసారి చాటింది.బర్గాస్ సమ్మర్ ఫెస్టివల్ అండ్ మిసెస్ ప్లానెట్ అంతర్జాతీయ అందాల పోటీలను బల్గేరియా దేశంలో జులై 6 నుంచి 15 వరకూ జరిగాయి. గతంలో 2019లో మిసెస్ అమరావతి, 2020లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021 లో మిసెస్ ఇండియా టైటిల్స్ గెలుచుకున్న మల్లిక 2022 సంవత్సరానికి మిసెస్ ప్లానెట్ పోటీలో నెగ్గి కిరీటాన్ని స్వంతం చేసుకున్నారు. ఎంబిఏ చదివిన మల్లిక బిజినెస్ మ్రాన్ జితేంద్రను వివాహం చేసుకున్నారు. వీరికి 6 వతరగతి చదువుతున్ప ఓ కుమారుడు ఉన్నాడు.