Suryaa.co.in

Andhra Pradesh

ముస్లిం మతపెద్దలూ.. ఇప్పుడు జగన్ రెడ్డిని ప్రశ్నించగలరా?

– ముస్లిం సమాజానికి క్షమాపణలు చెబుతారా?
– సంసారానికి, వ్యభిచారానికి ఉన్నంత తేడా
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షుబ్లి

విజయవాడ: టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే, కూటమి అభ్యర్థులకు ఓటు వేయకండి అని ఎన్నికలకు ముందు మాట్లాడిన సో కాల్డ్ ముస్లిం మతపెద్దలు ఇప్పుడు ఏం సమాధానమిస్తారు.

నిన్న జరిగిన లోక్ సభ స్పీకర్ ఎన్నికలో మా మద్దతు బీజేపీకే, మా ఓటు బీజేపీకే అని వైసీపీ తీసుకున్న నిర్ణయంపై జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించగలరా? ముస్లిం సమాజానికి క్షమాపణలు చెబుతారా? మేము తొలి రోజునుండే ఆంధ్ర రాష్ట్రంలోని రెండు పార్టీలు (టీడీపీ- వైసీపీ) బీజేపీ తోనే ఉన్నాయని చెబుతూనే ఉన్నాము.

మేము పొత్తులో ఉన్నామని బహిరంగ ప్రకటన చేసి ఎన్నికలకు వెళ్లేవాళ్లకు, మేము పొత్తులో లేము అంటూ తెరచాటు వ్యవహారాలు నడిపే వారికి చాలా వ్యత్యాసం ఉందని, తెరచాటు వ్యవహారాలతో లోపాయకారి ఒప్పందాలతో వెళ్లే వారు ప్రమాదకరమని మేము చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీకి మద్దతు విషయంలో ఇరు పార్టీల విధానాన్ని గమనిస్తే (టీడీపీ, వైసీపీ) సంసారానికి, వ్యభిచారానికి ఉన్నంత తేడా ఉంది.

LEAVE A RESPONSE