Suryaa.co.in

Telangana

ఎంవి.సుభాషిణికి ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల పీహెచ్ డి ప్రధానం

పెండేకంటి లా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న  ఎం వి సుభాషిణి కి ‘పార్డెనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్& గవర్నర్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్రిటికల్ స్టడీ ఆఫ్ థెయిర్ ఎక్సర్సైజ్'(భారత రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్,గవర్నర్లకు క్షమాభిక్ష నిర్ణయ అధికారంపై-విమర్శనాత్మక అధ్యయనం) అనే అంశంపైన సమర్పించిన పరిశోధనా పత్రానికి ఉస్మానియా యూనివర్సిటీ, లా విభాగంలో పీహెచ్ డి ప్రధానం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల మాజీ డీన్ ప్రొఫెసర్ జి బి రెడ్డి పర్యవేక్షణలో  పరిశోధన కొనసాగించారు. ఈ సందర్భంగా పెండేకంటి లా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.

LEAVE A RESPONSE