Suryaa.co.in

Andhra Pradesh Telangana

బీజేపీని బలోపేతం చేయడమే నా లక్ష్యం

– మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
– గన్నవరం ఎయిర్ పోర్ట్ కు భారీ గా చేరుకున్న బిజెపి శ్రేణులు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపి జీవిఎల్ నరసింహారావు, ఎపి సహా ఇంఛార్జి సునీల్ దేవదర్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్య నారాయణ రాజు, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, బిట్రశివన్నారాయణ, సుమంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేతృత్వంలో బిజెపి శ్రేణులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు భారీ సంఖ్యలో బిజెపి శ్రేణులు తరలి వచ్చారు అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి బిజెపి కార్యాలయంలో కి రాగానే బాణాసంచా కాల్చి, తీన్మార్ డప్పులు తో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి భారీ స్వాగతం పలికారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపి జీవిఎల్ నరశింహరావు, ఎపి సహా ఇంఛార్జి సునీల్ దేవదర్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్య నారాయణ రాజు,ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, బిట్రశివన్నారాయణ, సుమంత్ రెడ్డి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, తపన చౌదరి, మహిళా నేతలు శరణాల మాలతీ రాణి,నిర్మలా కిషోర్, సుబ్బారెడ్డి, శ్రీ కాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సోము వీర్రాజు మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి సిఎం గా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేశారు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో‌కూడా అమలు‌ చేసేలా ఆదర్శంగా నిలిచారు. ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలలో ఆయనకి స్పష్టత ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి సేవలను బిజెపి పెద్దలు ఉపయోగించుకుంటారు. పార్టీ బలోపేతం కోసం ఆయనతో కలిసి మేమంతా పని చేస్తాం. అందరినీ కలుపుకుని మేము సాగుతాం.
కాంగ్రెస్ పై కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు 1975 కు ముందు ఇందిరాగాంధీ 350సీట్లు గెలిచార, ఆమెను ఆ సమయంలో అలహాబాద్ కోర్టు అనర్హురాలిగా ప్రకటించింది ప్రజాభిమానం ఉన్నా… న్యాయ పరంగా ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. రాజనారాయణ అనే వ్యక్తి ఇందిరాగాంధీ పై కేసు వేశారు, ఆ తరువాత దేశంలో ఎమర్జెన్సీ తెచ్చారు.

ఈ పరిణామాలు తరువాత రెండేళ్లు శిక్ష పడితే అనర్హత వేటు వేయాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ విషయంలో కోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాలి, విభజన చేయడం వల్ల ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని సిఎం గా నేను అప్పుడే చెప్పాను. కాంగ్రెస్ ఇచ్చే హామీలు పని చేయవని,ఓటమి తప్పదని కూడా వివరించా అవి వినకపోవడం వల్లే నేను కాంగ్రెస్ ను‌ వీడాను జగన్ ప్రభుత్వం పై కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు ఏ ప్రభుత్వం అయినా చట్ట పరిధిలో పని‌చేయాలి. నేను సిఎం గా ఉన్న సమయంలో ఇలాంటి దాడులు జరిగాయా ఇప్పుడు ప్రభుత్వం లేదు…‌ కార్పొరేట్ కంపెనీ లు మాత్రమే ఉన్నాయి. చాలా ప్రాంతీయ పార్టీలు గురించి ఇదే నా అభిప్రాయం ఏ ప్రభుత్వం అయినా ఇష్టం వచ్చునట్లుగా చేస్తే… కుదరదు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ‌విషయంలొ జాతీయ విధానాన్నే అమలు చేశారు. నష్టం వచ్చే పరిశ్రమలు నడిపితే ప్రజా ధనం వృధా అవుతుంది. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ విషయంలో సెంటిమెంట్ ఉంది అందుకే దానిని లాబాల్లోకి ఎలా తేవాలనేది కూడా ఆలోచిస్తాం.నా సోంతూరు చిత్తూరు… నేను హైదరాబాద్ లో పుట్టాను.. పెరిగాను ఇండియన్ గా నేను ఎక్కడైనా ఉండే స్వేచ్ఛ ఉంది.

బిజెపి అధిష్టానం ఎక్కడ పని‌చేయమంటే అక్కడ చేస్తాను. బిజెపి ప్రాధమిక సభ్యత్వం‌ కోసమే చేరాను. పదవులు ఆశించి నేను చేరలేదు… పార్టీ కోసమే నా పయనం, పోటీ చేస్తానా లేదా అనేది మా అధిష్టానం నిర్ణయం చేస్తుంది. మా బ్రదర్ టిడిపి లో‌చేరిన నాటి నుంచి ఆయన ఇంటికి నేను పోలేదు, ఎవరి రాజకీయ జీవితం వారిష్టం… ఎవరి దారి వారిది, అమరావతి విషయంలో బిజెపి అభిప్రాయమే నా అభిప్రాయం. సమయం, సందర్భాన్ని బట్టి బిజెపి పెద్దలు నిర్ణయాలను మేమంతా పాటిస్తాం. మీరు ఎలా అడిగినా నేను అంత ఈజీగా మీకు దొరకను ప్రత్యేక హోదా ఎపి అభివృద్ధి కి అవసరం కానీ ప్రత్యామ్నాయంగా నాడు స్పెషల్ ప్యాకేజీ కి అందరూ అంగీకరించారు పాత్రికేయుల సమావేశం తర్వాత బిజెపి నేతలు పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపి జీవిఎల్ నరశింహరావు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్య నారాయణ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, బిట్రశివన్నారాయణ, విష్ణుకుమార్ రాజు, సురేష్ రెడ్డి ,తోట రామకృష్ణ, బబ్బూరి శ్రీ రాం, కోలా ఆనంద్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE