Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి ఒక్క రూ గ్లోబల్ లీడర్స్ గా మారాలన్నదే నా ఆలోచన

– పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టా
– మూడుపూటలా తిండిలేని వాడి గురించి మీరు నేను ఆలోచించ డమే నిజమైన మానవత్వం
– మేథావి మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరం అనేది నినాదం గానే మిగిలిపోవడం బాధాకరం
– ఆక్వా రైతులకు కచ్చితంగా ఆదుకుంటా.
– భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ‘అమలాపురం ప్రగతికోసం ప్రజావేదిక’ సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

“ వైద్యులు, ఇంజనీర్లు, లాయర్ల వంటి వివిధ రంగాల నిపుణుల అభి ప్రాయాలు, ఆలోచనల్ని రాష్ట్ర భవిష్యత్ కోసం వినియోగించాలనే సదుద్దేశం తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విజన్ – 2047లో నేను 5 ప్రతిపాదనలు పెట్టాను. వాటిలో ప్రధానమైన ది సోలార్ విండ్ పంపుడ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్. ఈ విధానం నిజంగా గేమ్ ఛేంజర్ అవుతుంది. అమలాపురానికి అవసరమైన విద్యుత్ మొత్తాన్ని ఇక్కడే తయారుచేసుకోవచ్చు. సరఫరాలో నష్టాలు తగ్గుతాయి. దాంతో గృహావసరాలకు, పరిశ్రమలకు సరిపడిన విద్యుత్ కు ఎలాంటి లోటు ఉండదు.

విజన్-2047 లో రెండో పాలసీ వాటర్ పాలసీ.. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని నీటివనరులు మనకు ఉన్నాయి. గంగా కావేరి అనుసంధానంలో గోదావరి నదికూడా ఉంది. గోదావరి నుంచి ఏటా 2, 3 వేల టీఎంసీ ల నీరు సముద్రం పాలవుతోంది. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రానికి నీటి కొరతే ఉండదు. దానికోసమే పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను.

ఒకప్పుడు జాతీయ రహదారులు చాలా అధ్వాన్నంగా ఉండేవి. బీవోటీ కింద కొత్తగా విశాలమైన రహదారులు వేయడంతో అభివృద్ధికి దారులు ఏర్పడ్డాయి.వాటర్ పాలసీ తర్వాత డీప్ డ్రైవ్ టెక్నాలజీ. సాంకేతికత అనేది ఎంతలా మారిపోతుందో, ఎంతగా ప్రజల్ని ప్రభావితం చేస్తుందో ఊహకు అందని విషయం. సాంకేతికతలో మానవ మేథస్సుదే ప్రధాన పాత్ర.

తరువాత పాలసీ పాపులేషన్… ఇంతకు ముందు పాపులేషన్ ను కంట్రోల్ చేశాం. భవిష్యత్ లో పాపులేషన్ మేనేజ్ మెంట్ జరగాలి. పాపులేషన్ ను సక్రమంగా మేనేజ్ చేయగలిగితే, భారతదేశం 100ఏళ్ల స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకునే నాటికి వందదేశాలకు నాయకత్వం అందించే శక్తి మన దేశానికి వస్తుంది.

విజన్ – 2047లో లాస్ట్ పాలసీ… గ్లోబల్ థింకింగ్. కోవిడ్ వచ్చినప్పుడు ఇళ్లల్లో ఉండే పనులు చేశారు. రాబోయేరోజుల్లో ప్రతి ఊరి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ, సంపాదించుకునే అవకాశం కలగాలి. ప్రతి ఒక్క రూ గ్లోబల్ లీడర్స్ గా మారాలన్నదే నా ఆలోచన.

సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలు ప్రకటించాను. అవి మహాశక్తి, యువగళం, అన్నదాత, బీసీల రక్షణ చట్టం, ఎంపవర్ మెంట్, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడం. వీటిలో వినూత్నమైనది పేదరికం లేని సమాజం తయారుచేయడం.

ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ (P-4) మోడల్. ఈ విధానాన్ని కచ్చితంగా అమలుచేస్తే, ప్రతి కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించవ చ్చు. దీన్ని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ విధానాల్లో అమలు చేస్తే, పేదల్ని ధనికుల్ని చేయవచ్చన్నది నా ఆలోచన. మనకు తెలివైన మానవ వనరులున్నాయి.. అలానే నీటివనరులు, తీర ప్రాంతం రాష్ట్రానికి ఉన్న వరాలు. వీటిని దృష్టిలో పెట్టుకొనే గతంలో విజన్ 2029 అని ఆలోచించాను. 2014 నుంచి వరుసగా టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే 2029కి మనరాష్ట్రం దేశంలోనే నంబర్-1 అయ్యేది.

ఎప్పుడైనా నీరు, పరిశ్రమలు, రోడ్లు ఉంటేనే భూముల ధరలు పెరుగుతాయి. అభివృద్ధి జరిగితేనే భూమి విలువ పెరుగుతుంది. 25ఏళ్లక్రితం హైదరాబాద్ కోకాపేటలో ఎకరం భూమి ఎంత? ఇప్పుడు రూ.100కోట్లకు చేరింది. కియా పరిశ్రమ రాకముందు అనంతపురం జిల్లాలో ఎకరం భూమి విలువ వేలల్లో ఉంటే, ఇప్పుడు లక్షలకు చేరింది.

మంచి చెడుల విశ్లేషణలో కులం, మతం, ప్రాంతం, బంధుత్వం వంటివి అడ్డు వస్తే, మనం అనుకున్నది జరగదు. ప్రజలు దీనిపై ఆలోచించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై ప్రజలతో పాటు మేథావులు కూడా స్పందించా ల్సిన సమయం వచ్చింది. ప్రజాచైతన్యంతో, మార్పుతో ఏదైనా సాధించవ చ్చు. నాఆలోచనలు మీకు తెలియచేశాను.. మీ అభిప్రాయాలు, ఆలోచన లు నాతో పంచుకోండి. మీరుచెప్పే వాటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రణాళికలు తయారుచేస్తుంది.

వివిధ రంగాల నిపుణుల సూచనలు, అభిప్రాయాలు… చంద్రబాబు స్పందన

ప్రభాకర్ (వైద్యులు) : మీ ఆలోచనా విధానంతో వాజ్ పేయ్ గారి హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగేలా చేశారు. 2000 సంవత్సరంలో కోనసీమ ప్రాంతానికి మెడికల్ కాలేజీ, నూతన రైల్వేలైన్, జాతీయ రహదారితో అనుసంధానం కల్పించారు. మెడికల్ కాలేజీ రావడం తో ఈ ప్రాంతంలో వైద్యుల సంఖ్య పెరిగింది. వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. అమలాపురానికి ఒక రైల్వే టోల్ గేట్ అవసరం ఉంది. పుట్టే ప్రతి బిడ్డ కు ఆరోగ్యబీమా కల్పించాలి. అలానే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు చౌకగా లభించేలా ఆలోచించాలి.

చంద్రబాబు స్పందన : ఏ ప్రాంతానికైనా కనెక్టివిటీ అనేది కీలకం. రోడ్లు, రైల్వే, వాయు, జలరవాణా ఎంత పటిష్టంగా ఉంటే, ఆయాప్రాంతాలు అంత త్వరగా అభివృద్ధి చెందుతాయి. తక్కువసమయంలో ఎక్కువ దూరం ప్రయాణిం చేలా కనెక్టివిటీ సౌకర్యాలు పెరగాలి. కోనసీమ ప్రాంతంలో వనరు లు ఎక్కువ. వాటిని సద్వినియోగం చేసుకుంటే, ఈ ప్రాంతం చాలాబాగా వృద్ధిలోకి వస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే మనం విజువలైజ్ చేసి, ఎగ్జిక్యూట్ చేసింది తరువాతి ప్రభుత్వాలు కొనసాగించాలి.

కానీ దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరగడంతో చాలా నష్టం జరిగింది. మీకు నాకు ఒక బాధ్యత ఉంది. తెలివైనవాళ్లు, అవకాశమున్నవాళ్లతో పాటు, ఎలాంటి అవకాశం లేనివాళ్లు కూడా ముందుకెళ్లాలి. మూడుపూటలా తిండిలేని వాడి గురించి మీరు నేను ఆలోచించ డమే నిజమైన మానవత్వం. మీరు ఇంత వృద్ధిలోకి వచ్చారు…. ఒక్కొక్కరు ఒక్కో పేదకుటుంబాన్ని బాగుచేయలేరా?

ఒక తరం సెటిల్ అయ్యేలా చేస్తే, తరువాతి తరం మీతో పాటు సమానంగా వృద్ధిలోకి వస్తారు. మనందరం ఇప్పుడు ఇన్ స్పైరింగ్ టైమ్ లో ఉన్నాం. సరైన స్పష్టత ఉన్న నాయకత్వం ఇప్పుడు చాలా అవ సరం.

విష్ణుమూర్తి (వైద్యులు) : ప్రభుత్వాలు ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయిస్తున్నా సగటు బీదవాడైన గ్రామీణపేదలకు ఉపయోగం ఉండటంలేదు. బడ్జెట్ కేటాయింపులే కాకుండా క్షేత్రస్థాయిలో మౌలికసదుపాయాలు కల్పించి, అవి సక్రమంగా పనిచేసేలా చూడాలి. ఎలాంటి విద్యాసంస్థలున్నా నాణ్యమైన విద్య లభించడం లేదు. సామాన్యుడికి ఉపయోగపడేలా వైద్య వ్యవస్థలో మార్పులు రావాలి. దానిపై మీరు ఎలా చేస్తారు?

చంద్రబాబు స్పందన : ఈ దేశంలో సంపద లేక పేదలు ఇబ్బంది పడటం లేదు. 1991 తర్వాత ఆర్థికసంస్కరణలు వచ్చాకే పోటీతత్వం పెరిగింది. ప్రతి కుటుంబానికి ఆరోగ్యబీమా ఉండి, పేషంట్లకు నచ్చిన వైద్యుడి వద్ద మంచి వైద్యసేవలు అందితే బాగుంటుందేమో! కొన్ని విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన అందుతోంది. కొన్నింటిలో సరైన బోధన అందడంలేదు. ప్రతి ఒక్కరికీ చదువుతో పాటు కామన్ సెన్స్ చాలా అవసరం. నేను ఇంజ నీరింగ్ కళాశాలలు పెట్టి, పెంచుకుంటూపోతున్నప్పుడు ఎందుకిన్ని కళాశాలలు అన్నారు. సరైన బోధనా సిబ్బంది లేరన్నారు. అప్పుడు ఉన్నత చదువు చదివినవాడు, కిందిస్థాయి వాడికి బోధిస్తాడు అన్నాను.

ప్రతి ఒక్కడికీ చదువుతో పాటు స్కిల్స్ నేర్పితే, ప్రపంచాన్ని జయించడం యువతకు సాధ్యమవుతుంది. యువత తలుచుకుంటే సాధ్యంకానిది లేదు. ప్రతి కుటుంబానికి రూ.లక్షవరకు ఆరోగ్యబీమా కల్పించి, దానితో మంచి వైద్యం అందించాలి. మీరు చెప్పినవాటిపై ఆలోచిస్తాను. సమస్య లకు పరిష్కారమార్గాలు కూడా మీరు ఆలోచించాలి.

ధన్వంతరి నాయుడు (వైద్యులు) : మా నాన్నగారు రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు, వైద్యుడు, న్యాయవాది ఈ ముగ్గురూ నిరంతర విద్యార్థులుగా ఉండాలని మా నాన్నగారు చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. యువత ఆత్మహత్యలు బాగా పెరిగాయి. వాటిని నిరోధించాలి.

చంద్రబాబు స్పందన : ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి మినిమమ్ స్టాండర్డ్స్ ఉండాలి. యువతలో ఆత్మహత్య చేసుకోవాలన్నఆలోచనలు ఎందుకు వస్తున్నాయి.. అవి రాకుండా మనమేం చేయగలం? అలానే యువత, చిన్నపిల్ల లుకూడా ఎక్కువగా సెల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. మానసికంగా సమస్యలున్న వ్యక్తితో అందరూ ఇబ్బంది పడతారు. ఈ ముఖ్యమంత్రి ఆలోచనలు ఏమిటో, ఎందుకు చేస్తున్నాడో తెలియడంలేదు. 60ఏళ్ల నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తున్న మార్గదర్శిలాంటి సంస్థను ఎందుకు లేకుండా చేయాలనుకుంటు న్నారు. యువతకు, చిన్నపిల్లలకు మానసిక వికాసంపై అవగాహన పెంచాలి.

మహమ్మద్ ఆదం (న్యాయవాది) : ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మీరు చూపే పనితీరుకి ఎలాంటివారైనా మీకు అభిమానులు కావాల్సిందే. 1996 నుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మీ ఆలోచనలు అమలు చేయాల్సింది అధికారులే.. కానీ వారు సాధారణప్రజలకు ఎంత దగ్గర అవుతున్నారన్నది చాలా ముఖ్యం. పోలీస్, రెవెన్యూ సిబ్బంది పనితీరుని క్లోజ్ గా పరిశీలించాలి. అధికారంలోకి వచ్చాక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతున్నాం.

చంద్రబాబు స్పందన : స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలు అమలవుతున్నాయి. పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు నేను ఉన్నప్పుడు సక్రమంగా, సమర్థవంతంగా పనిచేశాయి. ఇదే పోలీస్ వ్యవస్థ తీవ్రవాదుల్ని అణచివేసి, మతసామరస్యాన్ని కాపాడింది. అదే వ్యవస్థ ఇప్పుడు పైవాళ్లు ఏం చెబితే అదే చేస్తున్నారు. అమెరికాలో ఉండే ఎన్.ఆర్.ఐ, ఇక్కడున్నాడని ఏమీ ఆలోచించకుండా కేసు పెడుతున్నారు. నేను ఎప్పుడూ ప్రత్యర్థుల్ని అణచివేయాలని ఆలోచించలేదు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటనకు వెళ్లి, ఒక మంత్రి అవినీతిని ప్రశ్నిస్తే, నాపై రాళ్లదాడి చేశారు. పోలీసులు చూస్తూ నిలబడ్డారు. అక్క డ చేయాల్సిన దారుణం వాళ్లు చేసి, నాపైనే 307కేసు పెట్టారు. తప్పుని తప్పు అని చెప్పకపోతే, మీకు అన్యాయం జరిగితే రేపు ఎవరూ ముందుకు రారు. నిన్న జొన్నాడలో ఇసుక రీచ్ ను సందర్శించాను.

మే నెల నుంచి రాష్ట్రంలో జరిగే ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎలాంటి కాంట్రాక్టర్ లేడు. దానిపై నేను ప్రశ్నిస్తే అది తప్పా? మేథావి మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరం అనేది నినాదం గానే మిగిలిపోవడం బాధాకరం. ఏ రంగంలో అయినా రెగ్యులేషన్ కంట్రోల్ ఈజ్ బెస్ట్ మెకానిజం. దీనిపై మేథావులు కూడా ఆలోచించాలి.

వర్మ (ఆక్వారైతు) : 30 ఏళ్లుగా ఆక్వాసాగులో ఉన్నాను. ఈ నాలుగేళ్లలో ఎన్నడూ పడని ఇబ్బంది పడుతున్నాం. యూనిట్ విద్యుత్ రూ.2లకు మీరు అందించినప్పుడే బాగుంది. ఇప్పుడు రూ.1.50 పైసలకు ఇస్తున్నా ఉపయోగం లేదు. మిగతావాటి ధరలు పెంచేశారు.

చంద్రబాబు స్పందన : రాయలసీమలో హార్టీ కల్చర్, కోనసీమలో ఆక్వా రంగం, ఇతరప్రాంతాల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలనుకున్నాను. దానికి తగినట్టే ప్రణాళికాబద్ధంగా పని చేశాను. ఐదేళల్లో ఆక్వారంగంలో 30శాతం వృద్ధి రేటు వచ్చింది. చిన్నరైతు, పెద్దరైతు అని లేకుండా ఆక్వారంగాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అభివృద్ధి చేశాను. ఆక్వా రైతులకు కచ్చితంగా ఆదుకుంటా.” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE